అదో దెయ్యాల కొంప.. 1951లో మొదలైన స్టోరీ నేటీకీ ప్రజలను భయపెడుతుందే..!

-

దెయ్యాల కొంప: దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే.. చాలా మంది దెయ్యాలంటే భయపడతారు.. అయినా హర్రర్‌ మూవీస్‌ చూసేందుకు ఇష్టపడతారు.. మీరు అంతే కదా..! చాలా వరకూ హర్రర్‌ మూవీస్‌ అన్నీ ఊహించుకోని రాసినవే.. కానీ ఇప్పుడు చెప్పే స్టోరీ మాత్రం సినిమా తీస్తే.. నెంబర్‌ వన్‌ గోస్ట్‌ మూవీ అవుతుంది. ఇది రీల్‌ స్టోరీని మరిపించే రియల్‌ హర్రర్‌ స్టోరీ..! అది ఒక బూత్‌ బంగ్లా.. అదీ మన దేశంలోనే.

 

కేరళలో భూత్ బంగ్లాగా చెప్పుకొనే బోనాకాడ్ బంగ్లాను 1951లో బ్రిటిష్ వాళ్లు నిర్మించారు. అగస్త్య పర్వత శ్రేణిలోని పచ్చని దట్టమైన అడవుల మధ్య ఇది ఉంది. దీన్ని 25 GB బంగ్లా అని పిలుస్తారు. ఈ బంగ్లా కట్టిన ఆంగ్లేయుడు టీ తోట నిర్వాహకుడు. అతను తన కుటుంబంతో ఈ ఇంట్లో నివసించేవాడు.. ఒక రోజు అతని బిడ్డ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.. ఆ తర్వాత అతను తన భార్యతో కలిసి లండన్‌ వెళ్లిపోయాడు. అక్కడి నుంచే ఈ బంగ్లా బేతాళ కథలు పుట్టాయి. అప్పటి నుంటే స్టాట్‌ అయింది స్టోరీ..

బాలిక మృతి చెందిన తర్వాత ఈ ప్రాంతంలో పుకార్లు షికార్డు కొట్టాయి.. కిటికీ దగ్గర ఒక అమ్మాయిని చూడగానే అద్దాలు పగలగొట్టిన శబ్దం వచ్చిందనీ, బాలిక అరుస్తున్న శబ్దం వినిపించిందనీ, బంగ్లాలో దెయ్యం కనిపించిందనీ ఇలా ఎన్నో కథలు. ఒక రోజు కట్టెలు సేకరించడానికి ఆ బంగ్లాకు వెళ్లిన స్థానిక యువతి… తిరిగి వచ్చిన తర్వాత వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. చదువుకోని ఈ అమ్మాయి ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటమే కాకుండా… చదవడం, రాయడం కూడా చేయగలనని చెప్పింది. దాంతో… చనిపోయిన పిల్ల దెయ్యం ఆ అమ్మాయికి పట్టిందని చాలా మంది నమ్మారు.

 

బోనాకాడ్ రాజధాని తిరువనంతపురం నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రభుత్వ కఠినమైన ఆంక్షల కారణంగా ఆ ప్రాంతంలో హోటళ్లు లేదా రిసార్ట్‌లు లేవు. బంగ్లా తలుపులు, కిటికీలు పగలగొట్టి, కొన్ని చెక్క పలకలతో తలుపులు మూసినట్లు తెలుస్తోంది. పగటిపూట ఇంట్లోంచీ బయటకు వెళ్లే ఆ దెయ్యం అమ్మాయి… రోజూ రాత్రి ఇక్కడకు వచ్చి తిరుగుతుందని స్థానికులు చెబుతారు.

కారణం ఏమై ఉండొచ్చు..

బంగ్లాను కట్టించిన ఆంగ్లేయుడు… ఈ ప్రదేశాన్ని కనుక్కునేందుకు మొదట.. కరింతందన్ అనే గిరిజన యువకుడి సహాయం తీసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ఆ గిరిజన యువకుణ్ని ఆ బ్రిటీష్ ఇంజినీర్ చంపేశాడనీ… ఆ యువకుడే.. దెయ్యమై.. ఆగ్లేయుడి కూతుర్ని చంపేశాడని చెబుతుంటారు. ఇప్పటికీ కరింతందన్ ఆత్మ అక్కడ తిరుగుతుందని స్తానికులు బలంగా నమ్ముతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version