తెలియక ‘ది ఎగ్జోర్సిస్ట్ హౌస్’ కొన్న దంపతులు..ఇప్పుడు దెయ్యం మళ్లీ వస్తుందేమే అని ఆందోళన

-

హర్రర్ మూవీస్ ని ఊరికే మనసుకు అనిపించనట్లు తీసేయరు..దాదాపు దెయ్యాల సినిమాలన్నీంటికి ఒక రియల్ లైన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకునే సినిమాలో కాస్త సాల్ట్ పెప్పర్ యాడ్ చేసి తీస్తారు. ది ఎగ్జోర్సిస్ట్ హౌస్ సినిమా చూశారా..హర్రర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్లు ఈపాటికే చూసి ఉంటారు. అది చూస్తే వెన్నులో వణుకు పుట్టటం కాయం. అసలు దెయ్యాల సినిమాలకు బ్లూ ప్రింట్ అనిచెప్పుకోవచ్చు ఆ సినిమాను. అప్పటివరకూ ఉన్న దెయ్యాల సినిమాలకు ఆ సినిమాకు పిచ్చ తేడా ఉంటుంది. ఆ తర్వాతే దెయ్యాల సినిమాల్లో మార్పు వచ్చింది. అయితే ఈ సినిమాను కూడా ఒక నిజమైన కథ ఆధారంగానే రాసుకున్నారు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

the exorcist house

చిన్న చిన్న వస్తువులైతే పెద్గగా ఆలోచించకుండా కొనుక్కోవచ్చు. కానీ ఒక ఇల్లు కొనలాంటే ఎంత ఆలోచించాలి చెప్పండి. వెనకాముందు చూసుకోవాలి కదా, కానీ ఆ దంపుతులు తక్కువ ధరకు వస్తుంది కదా అని కొనేశారు. ఆనందాలను ఇవ్వాల్సిన కొత్తిళ్లు వారికి భయాన్ని ఇచ్చింది. డేనియల్ విట్, బెన్ రాకీ హారిస్ దంపతులు పోయి పోయి ఓ దెయ్యాల కొంపను కొనుక్కున్నారు. ఇప్పుడు లబోదిబో మంటున్నారు.

అమెరికాలో వారికి ఓ అలవాటు ఉంటుందట. ఇల్లు కొనే ముందే దాన్ని గూగుల్‌లో చెక్ చేస్తారు. తద్వారా అడ్రెస్ లొకేషన్, ఇతరత్రా వివరాలు తెలుసుకోవచ్చు.. కానీ ఈ దంపతులు అలా చెయ్యలేదు. డైరెక్టుగా కొనేశారు. కొన్న తర్వాత గూగుల్‌లో దాన్ని వెతికారు. గూగుల్ మ్యాప్స్‌లో తమ ఇల్లు కనిపించింది. గూగుల్ వచ్చిన దాన్ని చూసి దంపతులుకు దిమ్మతిరిగి పోయింది. ఆ ఇంటికి ది ఎగ్జోర్సిస్ట్ హౌస్ అని రాసి ఉంది. అదేంటి అనుకున్నారు. ఆ ఇంటి చరిత్ర కొంత చదివాక మ్యాటర్ కొద్ది కొద్దిగా అర్థమైయింది. అసలా ఇంటి చరిత్ర ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అనిపించింది వాళ్లకు. ఆ ఇంటిని అలా ఎందుకు పిలుస్తున్నారో చదివారు.

1949లో ఆ ఇంట్లో ఓ ఘటన జరిగింది. స్థానిక రిపోర్టుల ప్రకారం 14 ఏళ్ల పిల్లాడికి దెయ్యం పట్టిందట. ఆ సమయంలో ఇల్లంతా చల్లగా అయిపోయింది. దెయ్యం వస్తే ఇల్లు చల్లగా అవుతుందని వారు నమ్ముతున్నారు. ఆ ఇంట్లో ఫర్నిచర్ విచిత్రంగా తిరగబడి ఇంటి ఫ్లోర్‌కి అతుక్కున్నాయి. గాల్లో తేలుతున్నట్లు ఉన్నాయి. అంతే హడావుడిగా చర్చి ప్రీస్ట్‌లను పిలిచారు. వారు వచ్చి దెయ్యాల్ని వదిలించే మంత్రాలు చదివారు. అలా దెయ్యం వదిలించారని అంటుంటారు.

ఇదంతా తెలుసుకున్న జార్జ్‌టౌన్ యూనివర్శిటీ విద్యార్థి విలియం పీటర్ బ్లాట్టీ దీనిపై ఓ నవల రాసేశాడు. రెండేళ్ల తర్వాత ఆ నవల ఆధారంగా 1973లో ది ఎగ్జోర్సిస్ట్ సినిమా వచ్చింది. అదే ఇంటిని ఇప్పుడు ఈ దంపతులు కొనుక్కున్నారు. ప్రసెంట్ అయితే ఆ ఇంట్లో ఏ సమస్యా లేదు కానీ.. దెయ్యాల కొంప అని తెలిశాక ఆ ఇంట్లో ఉండాలంటే భయమేస్తుందంటున్నారు ఆ దంపుతులు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news