ఐపీఎల్-2022 మెగా యాక్షన్.. ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకోనున్నది.. రిటైన్ చేసుకోవడంతో ఎంత కోల్పోనున్నది

-

వచ్చే నెలలో ఐపీఎల్-2022 కోసం మెగా యాక్షన్ నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది. ఇందుకోసం మంగళవారం (నవంబర్ 30) లోపు రిటైన్ చేసుకొనే క్రికెటర్ల జాబితాను సమర్పించమని కోరింది. ఇప్పటికే దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకొనే ప్లేయర్లు జాబితాను ఖరారు చేశాయి. కానీ, రిటైన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు అధికారిక ప్రకటన చేయలేదు.

ఐపీఎల్ 2022 కోసం మెగా యాక్షన్ భారత్‌లో నిర్వహించనున్నారు. ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయమై బీసీసీఐ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్‌లో నిర్వహించడానికి దాదాపు అవకాశం ఉన్నది. మెగా యాక్షన్‌ను ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లైవ్ ప్రసారం చేయనున్నది.

ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకొనే ప్లేయర్ల జాబితా(అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్
మహేందర్ సింగ్ ధోని, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయినీ అలీ ఫాప్ డుప్లిసిస్

ఢిల్లీ క్యాపిటల్స్
రిషభ్ పంత్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్ట్జే, అక్సర్ పటేల్

ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, పొలార్డ్, ఇషాన్ కిషన్

కోల్‌కతా నైట్ రైడర్స్
సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, వెంకటేష్ అయ్యర్,

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్

రాజస్తాన్ రాయల్స్
బెన్ స్ట్రోక్స్, జాస్ బట్లర్

సన్ రైజర్స్ హైదరాబాద్
కన్నె విలయమ్సన్, రషీద్ ఖాన్

అందుతున్న సమాచారం ప్రకారం పంజాబ్ కింగ్స్ ఏ ఒక్క ప్లేయర్‌ను కూడా రిటైన్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2022లో కొత్త జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉన్నది.

పాత ఫ్రాంచైజీలు నవంబర్ 30లోపు రిటైన్ చేసుకొనే ప్లేయర్ల జాబితాను బీసీసీఐకి అందించాల్సి ఉంటుంది. ఒక్కో జట్టు నలుగురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు

ఐపీఎల్ 2022లో నూతన ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్ భాగం కానున్నాయి. ఇరు జట్లు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలోపు అక్షన్ సంబంధం లేకుండా ముగ్గురు ప్లేయర్లను తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కొత్త జట్లకు నో రైట్ టూ మ్యాచ్(ఆర్‌టీఎం) సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నది.

ఒక్కో జట్టు దగ్గర ప్లేయర్ల కొనుగోలు కోసం రూ.90కోట్ల వరకు వెచ్చించవచ్చు. అయితే ప్లేయర్ల రిటైన్‌ను అనుసరించి కోత ఉంటుంది.

నలుగురు ప్లేయర్లకు కోత – 42 కోట్లు
ప్లేయర్- 1 రూ.16కోట్లు
ప్లేయర్- 2 రూ.12కోట్లు
ప్లేయర్- 3 రూ.8కోట్లు
ప్లేయర్- 4 రూ.6కోట్లు

ముగ్గురు ప్లేయర్లకు కోత – 33 కోట్లు
ప్లేయర్-1 రూ.15కోట్లు
ప్లేయర్-2 రూ.11కోట్లు
ప్లేయర్-3 రూ.7కోట్లు

ఇద్దరు ప్లేయర్లకు – 24కోట్లు
ప్లేయర్-1 రూ.14కోట్లు
ప్లేయర్-2 రూ.10కోట్లు
ఒక్క ప్లేయర్‌కు రూ.14కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news