కూతురి బెడ్రూంలోకి చొరబడిన ఆకతాయి.. తల్లి ఏం చేసిందంటే..!

Join Our Community
follow manalokam on social media

ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే ప్రతి తల్లిదండ్రులకు భయమే. ఆకతాయిల నుంచి తమ పిల్లలను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటారు. అయితే తల్లి ఇంటి నుంచి వెళ్లినప్పుడు ఓ ఆకతాయి.. తన కూతురి బెడ్రూంలోకి చొరబడి తొంగి చూస్తున్నాడు. అదే సమయానికి ఇంటికి తిరిగి వచ్చిన తల్లి అతడి చూసి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆ ఆకతాయి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో తల్లి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.

MOTHER

అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన పోలీసు వాహనాలకు ఉంటే కెమెరాకు చిక్కింది. పెల్లీస్ పెనా అనే మహిళ ప్రతిరోజు తెల్లవారుజామున ఇంట్లో సరుకులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్తుంది. ఈ విషయం తెలిసిన జాన్ హాకిన్స్ అనే యువకుడు (19 ఏళ్లు). ఆ ఇంటి బెడ్రూం నుంచి తొంగి చూడటం మొదలు పెట్టాడు. అయితే ఆ సమయంలో పెనా కుమార్తె గదిలో లేదు. ఆమె ఆ గదిలోకి వస్తుందనే అక్కడే ఎదురు చూస్తూ నిల్చున్నాడు. కాసేపటి తర్వాత పెనా సరుకులు తీసుకుని ఇంటికి వచ్చింది. గదిలో హాకిన్స్‌ను చూసి పోలీసులకు సంప్రదించింది. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అది గమనించిన జాన్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

ఈ మేరకు పెల్లీస్ పెనా ధైర్యం తెచ్చుకుంది. పారిపోతున్న జానే హాకిన్స్‌ను వెనుక నుంచి గట్టిగా పట్టుకుంది. పెనా కూతురు కూడా అక్కడికి చేరుకుని హాకిన్స్ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీలు చేయగా.. నిషేధిత మత్తు పదార్థాలు బయట పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకుని హాకిన్స్‌ను అరెస్టు చేశారు. హాకిన్స్ డ్రగ్స్‌కు బానిసయ్యాడని, కేసు దర్యాప్తులో ఉందని, త్వరలో కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...