మనదేశంలో అపచారంగా భావించే చాలా వాటి వెనక లాజిక్ దాగుందని మీకు తెలుసా..?

-

భారతదేశంలోని ప్రజలు ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలని నమ్ముతుంటారు. చదువు లేకపోవడం వల్ల కొంత, ఉన్నా కూడా దానిలో క్వాలిటీ లేక కొంత, ప్రశ్నించే తత్వం లేకపోవడం కొంత.. మొదలగు వాటివల్ల ఆ నమ్మకాలని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఐతే చిత్రంగా అలా పాటించే చాలా వాటి వెనక లాజిక్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు.

అలాంటి కొన్ని విషయాలని ఇక్కడ చూద్దాం..

రాత్రిపూట గోళ్ళు కత్తిరించకూడదు.

దీనికి కారణం చాలా సింపుల్. అప్పట్లో ఇళ్ళలో కరెంట్ ఉండేది కాదు. అందువల్ల గోళ్ళు కత్తిరించుకుంటే అవి ఇంట్లోనే ఉండి, పాదాలకి గుచ్చుకుంటాయని రాత్రిపూట గోళ్ళు కత్తిరించుకుంటే అరిష్టం అని చెప్పారు.

గురువారం, మంగళవారం తల స్నానం చేయకూడదు..

తలస్నానం చేస్తే నీళ్ళు ఎక్కువ కావాలి. నీటి వృధాని అరికట్టడానికి కొన్ని ప్రత్యేక రోజుల్లో తలస్నానం చేయకూడదని చెప్పేవారు.

సాయంత్రం పూట ఇళ్ళూ ఊడ్వకూడదు.

అప్పట్లో కరెంట్ లేకపోవడం వల్ల దీపాలు వెలిగించుకునేవాళ్ళు. ఆ దీపాల వల్ల ఎక్కువ వెలుగు రాకపోయేది. మసక మసకగా ఉన్న ఆ వెలుతురులో ఇల్లు ఊడిస్తే ఏవైనా విలువైన వస్తువులు పోతాయని అలా ఊడ్వకూడని చెప్పేవారు.

ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు పెరుగు గానీ తీపి కానీ తినడం..

పెరుగు వల్ల పొట్ట చల్లగా ఉంటుంది. చక్కెర వల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది.

తులసి ఆకులను నమలకూడదు.

తులసి ఆకుల వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్ పొర బలహీనంగా మారుతుంది. అంతే కాదు దీనివల్ల పళ్ళు పసుపుపచ్చగా మారతాయి.

అందుకే దేన్నైనా ఖండించే ముందు దాని వెనక లాజిక్ వెతకండి.

Read more RELATED
Recommended to you

Latest news