జాతకంలో ఏదైనా దోషం ఉంటే కొంతమంది పెళ్లికి ముందు చెట్టును, గాడిదను, ఆవును ఇలాంటి వాటిని విహహం చేసుకుంటారు. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది కానీ పోయి పోయి మొసలిని చేసుకోవడం గురించి మీరెక్కడైనా విన్నారా..? ఒక పెద్ద మహానగరానికి మేయర్ అతను. ఆడమొసలిసి పెళ్లి చేసుకున్నాడు. ఈ వెడ్డింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మెక్సికోలోని ఓ సిటీ మేయర్‌కు ఆడ మొసలితో వివాహం జరిగింది. సిటీ మేయర్ అత్యంత ప్రమాదకరమైన మొసలిని పెళ్లాడటం చూసి బంధు,మిత్రులు సంబరాలు చేసుకుంటే..వార్త తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే ఇది వాళ్ల సంప్రదాయంలో ఒక భాగమని చెప్పుకొస్తున్నారు.
మెక్సికోలోని శాన్ పెడ్రో హ్యువామెలులా సిటీ మేయర్ విక్టర్ హ్యూగో సోసా ఆడ మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు బంధుమిత్రులతో పాటు తన పనివారం, అనుచరులు, అభిమానులతో పాటు సిటీకి చెందిన సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు. ఒక ఆడ మొసలిని తెల్ల దుస్తులతో పెళ్లి కూతురులా ముస్తాబు చేసి పెళ్లి వేడుకకు తీసుకొచ్చారు. అక్కడే ఆచారం ప్రకారం పూజలు, మంత్రాలు చదివిన తర్వాత మేయర్ విక్టర్ హ్యూగో మొసలిని పెళ్లి చేసుకొని దాన్ని ముద్దాడాడు. అయితే మేయర్ పెళ్లి చేసుకునే సమయంలో మొసలి మూతిని తాళ్లతో కట్టివేశారు.
తెల్లదుస్తులతో అలంకరించి ఇంటికి తెచ్చిన ఆడ మొసలికి వివాహ సమయంలో ఆకుపచ్చని దుస్తులు వేసి తెచ్చారు. వివాహం అనంతరం మేయర్ విక్టర్ హ్యోగో సోసా తన నూతన భార్య అయిన మొసలిని చేతుల్లో ఎత్తుకొని వేదికపై డ్యాన్స్ చేశాడు. అతనితో పాటు బంధువులు కూడా ఆడి, పాడారు. ఆడ మొసలిని పెళ్లి చేసుకున్న వార్త మెక్సికోలోని ఆ సిటిలో చర్చ కాకపోయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.
అనాదిగా వస్తున్న ఆచారం
శాన్ పెడ్రో హ్యువామెలులా టౌన్ మేయర్ విక్టర్ హ్యూగో సోసా ఛోంతాల్ తెగకు చెందిన వ్యక్తి. అయితే వీరి ఆచారం ప్రకారం.. తమ పాలనలో ప్రజలు క్షేమంగా ఉండాలని మొసలిని పెళ్లి చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. అందులో భాగంగా విక్టర్ మొసలిని వివాహం చేసుకున్నాడు. అయితే సుమారు 230 ఏళ్ల క్రితం కొనసాగించిన సంప్రదాయాన్ని తిరిగి ఇన్ని ఏళ్ల తర్వాత కొనసాగించడం చాలా ఆనందంగా ఉందని మేయర్ విక్టర్ హ్యూగో సోసా తెలిపారు.