“రాజమౌళి – మహేష్ బాబు” సినిమాపై అప్డేట్ ఇచ్చిన కీరవాణి కుమారుడు…

-

ఫేమస్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు ఒక సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథల గురించి ఇప్పటికే ఫైనల్ అయింది. షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినప్ప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ కథను ప్రముఖ దర్శకుడు మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమా గురించి తాజాగా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కొడుకు శ్రీసింహ ఒక అప్డేట్ ను అందించాడు. ఈయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి అందరిలాగే మా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా వర్కింగ్ స్టేజ్ లో ఉంది, త్వరలోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని శ్రీసింహ తెలిపారు.

అయితే ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం రాజమౌళి సినిమాలో నటించనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news