మీ మొబైల్ ఫోన్ ఈ ఇలాంటి ప్లేసుల్లో ఛార్జ్ చేస్తున్నారా? ఇక అంతే.. ఎక్కడ ఛార్జ్ చేయకూడదో తెలుసుకోండి.

-

కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా ఎక్కువ రోజులు వేరే చోట ఉండిపోవాల్సి వస్తుంది. అలాంటి టైమ్ లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కోలా చేస్తుంటారు. సాధారణంగా కొందరు పవర్ బ్యాంక్ పెట్టుకుని తిరుగుతుంటారు. కానీ ప్లానింగ్ లేని వాళ్ళు మాత్రం పబ్లిక్ ప్లేసెలో కనిపించే ఛార్జింగ్ స్టేషన్లలో మొబైల్ ని ఛార్జ్ చేస్తుంటారు. మీ ఫోన్ ని సెక్యూర్ గా ఉంచి, మీ సమాచారానికి ఎలాంటి భంగం కలగకుండా ఉండాలంటే ఇలాంటి స్థలాల్లో మొబైల్ ని ఛార్జ్ చేయకూడదు. అటువంటి స్థలాలేవో ఇక్కడ తెలుసుకుందాం.

విమానాశ్రయాలు

విమానాశ్రయాల్లో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన సదుపాయాలు ఉంటాయి. మొబైల్ ని అక్కడ పెట్టి ఛార్జ్ అయ్యాక మళ్ళీ తీసుకోవచ్చు. కానీ అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ఛార్జింగ్ సాకెట్ల ద్వారా మొబైల్ లోని సమాచారాన్ని లాగేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాటిల్లో హ్యాకర్స్ ముందుంటారు. ఎవ్వరైనా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంది కాబట్టి, కుట్రదారులు వాటిని హ్యాక్ చేసి డేటాని దొంగిలించే ఆస్కారం ఉంది.

రైల్వే స్టేషన్లు

రైల్వే స్టేషన్లలోనూ అదే పరిస్థితి. ,ముఖ్యంగా యుఎస్బీ పోర్ట్ ద్వారా అస్సలు ఛార్జ్ చేయవద్దు. స్టేషన్లలో హ్యాక్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.

అద్దెకు తీసుకున్న కారు

ఎక్కడకైనా వెళ్ళాలని కారు అద్దెకు తీసుకుని అందులో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటుంటారు. అలా ఎప్పుడూ చేయకండి. దాన్లో ఏం దాగుందో మనకు తెలియదు కాబట్టి, మన సమాచారానికి భంగం కలగవచ్చు.

మాల్స్

మాల్స్ లో మరింత ప్రమాదకరం. అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కావున, హ్యాకర్స్ ఈజీగా టార్గెట్ చేస్తారు. ఎక్కువ జనాలు రద్దీగా తిరుగుతున్న ప్రదేశాల్లో మొబైల్ ఛార్జ్ పెట్టకపోవడమే ఉత్తమం. కావాలంటే పవర్ బ్యాంకుని మీతో పాటు తీసుకెళ్ళండి.

Read more RELATED
Recommended to you

Latest news