పెళ్ళిచూపులకి వెళ్ళి పెళ్ళి సంబంధం కుదుర్చుకున్న తర్వాత పెళ్ళికి ఇప్పట్లో ముహూర్తాలు లేవు అన్న మాట చాలామందిని బాధిస్తుంది. పెద్దవాళ్ళైతే ఇలాంటి విషయాల్లో తొందరపెట్టాలనే చూస్తారు. సంబంధం కుదిరితే వెంటనే పెళ్ళీ చేసేయాలని చూస్తారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం. ఐతే పెళ్ళిచూపులకి పెళ్ళికి చాలా గ్యాప్ ఉన్నప్పుడు విరహం తట్టుకోలేక ఫోన్లలో మాట్లాడుకోవడం సహజమే. ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చినపుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మీ కుటుంబం గురించి చెడుగా అస్సలు చెప్పవద్దు. ఉదాహరణకి మీ నాన్న తాగొచ్చి ఇంట్లో నానా రచ్చ చేస్తాడనుకుందాం. ఆ విషయాలు పంచుకోకపోవడమే మంచిది. లేదంటే పెళ్ళి తర్వాత ఆ విషయాలే ఇబ్బందులకి దారి తీయవచ్చు.
మీ కాబోయే భాగస్వామికి గౌరవం ఇవ్వండి. అలాగే మీకు గౌరవం ఇచ్చేలా చూసుకోండి.
నీకోసం ఇంత ఖర్చు చేసి ఈ బహుమతి తీసుకొచ్చాను అని చెప్పకండి. మీ భాగస్వామి మీద మీరెంత ఖర్చుపెడుతున్నారనే విషయం ఇప్పుడే తెలియకుంటే మంచిది.
బయటకి కాఫీకి వెళ్ళాల్సి వచ్చినపుడు ఇతర అమ్మాయిలని అదే పనిగా చూడవద్దు. మగాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అనుమతి లేకుండా మీ కాబోయే భాగస్వామి ఫోన్ ని ముట్టుకోవద్దు. దీనివల్ల మీ ప్రైవసీకి కూడా భంగం కలగకుండా ఉంటుంది.
మీఖు కాబోయే భాగస్వామి ఏదైనా విషయంలో వాదిస్తూ ఉంటే, ఇతరుల చేత నచ్చజెప్పే ప్రయత్నం చేయవద్దు. మీ విషయాలని మీరే చూసుకోవాలి.
మీరు అబ్బాయిలైతే మీ భాగస్వామిని పెళ్ళి చేసుకున్నాక ఇంటి పనులే చూసుకొమ్మని బలవంత పెట్టవద్దు. మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎందుకు చదివించారో వారికి కూడా అందుకోసమే చదివించారని తెలుసుకోండి.