ఆరేళ్ళ నుండి ఈ కుటుంబంతా ఆసుపత్రిలోనే…. ఎందుకంటే…?

-

సాధారణంగా ఏమైనా ఒంట్లో బాగోకపోతే ఆసుపత్రికి వెళ్లి చూపించుకుని వచ్చేస్తాం… కానీ ఓ ఫ్యామిలీ మాత్రం ఆరేళ్లుగా హాస్పిటల్ రూములోనే ఉంటున్నారు. నిజమేనండి… కారణం కనుక చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా వీళ్ళు ఇల్లుగా మలచుకున్నారు. వాళ్ళని ఆసుపత్రి వాళ్ళు పంపించేందుకు ఎంతగా ప్రయత్నించినా వీలు అవ్వలేదు. అసలేం జరిగిందంటే..? చైనా లో 2014లో రెండు నెలల పాటు వికారం, వాంతులతో బాధపడుతూ ఒక వ్యక్తి బీజింగ్‌లోని ఓ హాస్పిటల్‌లో చేరాడు. డాక్టర్లు అతనికి ట్రీట్మెంట్ చేసారు. ఫైనల్ గా తియాన్ ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జి చేస్తున్నట్లు తెలిపారు.

from 6 years
from 6 years

బిల్లు వచ్చాక తియాన్ కుటుంబం ఖంగు తిన్నారు. అడ్మిట్ చేసుకుని, లక్షల రూపాయల బిల్లు వేస్తారా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించాడు. ఇక ఆ గొడవ తేలే దాక కదలనని తల్లిదండ్రులతో పాటు అన్ని సామాన్లని తెచ్చుకుని అదే రూమ్‌లో జీవించడం మొదలుపెట్టాడు. అక్కడే ఏ పండుగ వచ్చిన కూడా… అయితే హాస్పిటల్ వాళ్లు ఊరుకుంటారా..? పంపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఆఖరికి కోర్టుకు కూడా ఈడ్చారు. ఇంకేం ఉంది కేసు తీర్పు ఇవ్వడానికి.. సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తుంది.

ఆరేళ్లుగా సాగుతూ వచ్చింది ఈ కేసు… ఆఖరికి గత వారం ఈ కేసు మరోసారి విచారణకు రాగా.. తియాన్‌, అతడి తల్లిదండ్రులని హాస్పిటల్ వార్డును ఖాళీ చేసి వెళ్లాలని కోర్టు తీర్పునిచ్చింది. అలానే తియాన్ కుటుంబానికి రూ.5.36 లక్షలు పరిహారంగా చెల్లించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇలా ఆరేళ్ల తర్వాత కేసుకు పరిష్కారం వచ్చింది. ఆరేళ్ళ తరువాత కుటుంబం ఆసుపత్రి నుండి వెళ్లగా.. స్వయంగా హాస్పిటల్ యాజమాన్యమే అంబులెన్సులో తరలించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news