ఫ్రీగా వచ్చిన సోఫాలో లక్షలు..మహిళ ఏం చేసిందంటే?

-

ఈరోజుల్లో ఫ్రీగా వచ్చింది అంటే ఫినాయిల్ కూడా వదలరన్న విషయం అందరికి తెలిసిందే..కొంత మంది కక్కుర్తి గాళ్ళు పాచిపోయిన అన్నం దొరికిన తాలింపు వేసుకోని తింటారు.. అసలే కలికాలం.. అందులోనూ కరోనా మిగిల్చిన పరిస్థితుల వల్ల అందరూ పిసినారి అయ్యారు.ఇక విషయానికొస్తే..ఓ మహిళ ఫ్రీగా సోఫాను తెచ్చుకుంది. దాన్ని శుభ్రం చేయాలని అనుకుంది..కానీ అందులో ఉన్నవి చూసి షాక్ అయ్యింది. లక్షలు లక్షలు డబ్బులు ఉండటంతో ఆశ్చర్య పోయింది.

ఒక చోట సోఫాను ఫ్రీ గా ఇస్తున్నారని చదివింది. వెంటనే అక్కడికి వెళ్లి ఉచితంగా సోఫాను తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. అసలు కథ అప్పుడే మొదలైంది. సోఫాపై ఉండే దిండ్లకు చిన్నపాటి కుట్లు వేసుకోవడంలో ఆమె నిమగ్నమైంది. ఒక దిండును విప్పగానే కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కేస్తే మొత్తం రూ.27 లక్షలు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురైంది. వెంటనే కేకలు వేసి తన కొడుకును పిలిచి.. ఆ నోట్ల కట్టలను చూపించింది. ఈ వింత అనుభవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలోని కొల్టన్ పట్టణానికి చెందిన మహిళ విక్కి ఉమోదు కు ఎదురైంది. అయితే ఆమె నిజాయితీని చాటుకుంది. ఆ సోఫాను తనకు ఉచితంగా ఇచ్చిన వాళ్లకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది.

సోఫాలోని దిండ్ల నుంచి బయటపడిన డబ్బులన్నీ వాళ్లకు ఇచ్చేసింది.ఆ సోఫాల్లో ఉన్న డబ్బు ఎక్కడిదో తమకు కూడా తెలియదని .. దాన్ని ఇచ్చినవాళ్ళు కూడా చెప్పడం గమనార్హం. నిజాయితీని చాటుకున్న విక్కి ఉమోదు ను వాళ్ళు మెచ్చుకున్నారు. 2000 డాలర్లు నజరానాగా ఆమెకు ఇచ్చారు. ఆ డబ్బుతో కొత్త ఫ్రిజ్ కొనుక్కుంటానని విక్కి ఉమోదు చెప్పింది. సోఫా లో దొరికిన డబ్బును నేరుగా తన బీరువాలో పెట్టుకోకుండా వెనక్కి ఇచ్చిన ఆమె పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news