అది జగన్ స్కీం కాదు.. మోడీ ప్రవేశ పెట్టిన స్కీం: జేపీ నడ్డా

భారత దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మద్దతు తెలపాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా సోమవారం ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ మేరకు బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశానికి హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో 46వేల పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, బూత్ స్థాయి వరకు పార్టీని తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

జేపీ నడ్డా
జేపీ నడ్డా

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. పార్టీలోకి నూతన కార్యకర్తలు ఆహ్వానించాలన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ‘ఆయుష్మాన్ భారత్’ పేరుతో ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిందని, ఆ పథకాన్నే ‘ఆరోగ్య శ్రీ’ పేరుతో జగన్ ప్రభుత్వం ప్రచారం చేస్తోందన్నారు. నిజానికి ఆ పథకం సీఎం జగన్‌ది కాదని, మోడీదని ఆయన పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో రూ.5 లక్షల వరకు వైద్య సాయం అందిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు అవుతోందన్నారు. ఆరోగ్య శ్రీ కేవలం రాష్ట్రానికే పరిమితమని ఆయన ఎద్దేవా చేశారు.