రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. టిక్కెట్ బుకింగ్ ఇప్పుడు..?!

-

రైల్వే శాఖ ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి శుభవార్త ప్రకటించింది. నెలలో బుక్ చేసుకునే టిక్కెట్ల సంఖ్యను పెంచింది. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. గతంలో ఆధార్ అనుసంధానం అయిన యూజర్ ఐడీ నుంచి నెలలో గరిష్టంగా 6 టికెట్లు బుక్ చేసుకునేది. కానీ ఆ సంఖ్యను గతంలోనే 12కి పెంచింది. తాజాగా ఆ సంఖ్యను 24కు పెంచింది. దీంతో ప్రయాణికులు నెలలో 24 వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.

భారతీయ రైల్వే
భారతీయ రైల్వే

ఈ మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఆధార్ అనుసంధానం కాని యూజర్ గరిష్టంగా 12 టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆధార్ అనుసంధానం అయిన యూజర్ 24 టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రయాణికులు ముందుగా మీ యూజర్ ఐడీని ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. www.irctc.co.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయి.. సైన్ ఇన్ చేయడానికి మీ సమాచారాన్ని నమోదు చేయాలి. అందులో ఆధార్ లింక్ ఆప్షన్ క్లిక్ చేసి.. ఆధార్ డిటైల్స్ నమోదు చేయాలి. అనంతరం రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అనంతరం ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

Read more RELATED
Recommended to you

Latest news