అప్పుడు ఎగిరే దోశ.. ఇప్పుడు రజనీకాంత్ స్టైల్ దోశ.. వైరల్ అవుతున్న వీడియో..

-

రెస్టారెంట్లలో ప్లేట్ నిండా ఆహారాన్ని ఒక క్రమ పద్దతిలో పెట్టుకుని కస్టమర్ ని ఆకర్షించేలా చేసే హోటళ్ళు చాలా ఉన్నాయి. ప్లేట్ లో వాళ్ళు సర్దిన భోజనం చూడగానే లొట్టలేసుకుని మరీ తినాలని అనిపిస్తుంది. అందుకు భిన్నంగా వీధుల్లో ఉండే చిన్న చిన్న ఫుడ్ సెంటర్లు చాలా కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. మొన్నటికి మొన్న గాల్లో ఎగిరే దోశ ఫేమస్ అయ్యింది. దోశ తినడానికి వచ్చిన తమ కస్టమర్లకి దోశలని చేస్తూ వాటిని అందించే విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. గాలిలో విసిరేస్తే అది డైరెక్టుగా కస్టమర్ ప్లేట్ లో పడడం అందరూ షాకయ్యారు.

ముంబైలో ఒకానొక ఫుడ్ సెంటర్లో జరిగిన ఈ సన్నివేశం వీడియో రూపంలో బయటకి వచ్చింది. వైరల్ అయ్యింది కూడా. తాజాగా రజనీ కాంత్ స్టైల్ దోశ వీడియో వైరల్ అవుతుంది. ఇది కూడా ముంబైలోదే కావడం విశేషం.

ముంబైలోని దాదర్ లో ముత్తు ఫుడ్ కార్నర్ గురించి తెలియని వాళ్ళుండరు. అక్కడ తిరుగాడే వారికి ప్రతి రోజూ అక్కడే టిఫిన్ చేయడం అలవాటు. ఐతే ముత్తు ఫుడ్ కార్నర్ లో ప్రత్యేకమైనదేమైనా ఉన్నదంటే అది దోశ మాత్రమే అని చెప్పాలి. మీకు కావాల్సిన దోశ క్షణాల్లో పెనం మీద కాలడమే కాకుండా, పూర్తిగా కాలిన దాన్ని ముక్కలుగా విడగొట్టి ప్లేట్ లోఖి రజనీ కాంత్ స్టైల్ లో పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఒక్కదోశ కాదు ఎలాంటి దోశ కావాలన్నా ఇదే స్టైల్ లో అందించబడుతుంది. రజనీకాంత్ స్టైల్ లో దోశ అందించబడడంతో ఈ దోశకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది.

https://www.facebook.com/watch/?v=273010704297994

Read more RELATED
Recommended to you

Latest news