చైనాలో కుక్కలకు,గాడిదలకు భలే డిమాండ్..ఎందుకో తెలుసా?

-

మన పొరుగు దేశమైన చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏదొక కొత్త పని చేస్తూ అందరికి షాక్ ఇస్తూ ఉంటుంది.. ఇప్పుడు కూడా అలాంటి షాక్ ఇచ్చింది. కుక్కలను, గాడిదలను ఎక్కువగా దిగుమతి చేసుకొవాలనుకుంటుంది.. అదేంటి అనే సందేహం రావడం కామన్..కానీ ఇది నిజం అండి బాబు..అందుకు కారణాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.. అదేంటో ఇప్పుడు చూద్దాం.. గాడిదలు, కుక్కల చర్మం నుంచి ఎజియావో అనే పదార్థాన్ని తయారు చేస్తారు.

ఈ పదార్థాన్ని ఔషధాల తయారీలో వాడుతారట. పైగా ఇది చాలా ఖరీదైంది. పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదల్ని దిగుమతి చేసుకుంటే దీన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేయొచ్చు. అందుకే ఈ అంశంపై చైనా దృష్టి సారించింది..అయితే గతంలో పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదలు, ఒంటెల మాంసం చైనాకు దిగుమతి అయ్యేది. చాలా ఏళ్ల నుంచే పాక్ తమ దేశం నుంచి జంతువుల్ని చైనాకు ఎగుమతి చేస్తోంది.

కాగా, ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అప్పులపాలైన పాకిస్తాన్‌కు వాటిని తీర్చే శక్తి లేదు. అలాగని కొత్త అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. ఆహారం, చమురు కొనడానికి కూడా ఆ దేశం దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని కొన్ని కథనాల సమాచారం.. ఇది అవకాశంగా భావించిన చైనా పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదల్ని తీసుకుని, ఆ దేశానికి నిధులు అందివ్వాలని భావిస్తోంది. అయితే,మరోవైపు పాక్ నుంచి కొనేబదులు అఫ్ఘనిస్తాన్ నుంచి కొనుక్కుంటే మేలని కొందరు చైనా అధికారులు భావిస్తున్నారట.. ఏంటో చైనా ప్లాన్ లు ఎవరికీ అర్థం కావు.. ఇప్పటికే కరోనాతో విధ్వంసం సృష్టించింది ఇప్పుడు ఏం చేస్తుందో మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version