ఆ గ్రామంలో చెట్లకు డబ్బులుంటాయ్..కానీ తీసుకుందామంటే..!

-

 మనం చిన్నప్పటి నుంచి ఈ డైలాగ్ బాగా విని ఉంటాం..డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా అని. కానీ నిజంగానే చెట్లకు డబ్బులు కాస్తే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి..అబ్బా..ప్రతిఇంట్లో చెట్లు ఉంటాయ్ కదా.. ఇదంతా ఊహలకే పరిమితం..నిజం ఎప్పుడు అవ్వాల్లే అనుకునుంటున్నారా..కానీ నిజంగానే అక్కడ చెట్లకు డబ్బులు ఉన్నాయట. యూకేలోని ఓ గ్రామంలో ఇలా జరుగుతుందట..
బ్రిటన్ లోని ఒక గ్రామంలో చెట్లకు నిజంగానే డబ్బులు కాస్తున్నాయ్ అని అక్కడి ప్రజలు చెప్తున్నారు.. ఆ విలేజ్ లోని చెట్ల నిండా కాయిన్స్ ఉంటాయి. ఒకొక్క చెట్టుకు వేల రూపాయల నాణేలు ఉంటాయి. అయితే ఈ చెట్ల నుంచి ఒక్క కాయిన్ కూడా తీసుకోరు. తీసుకోవాలన్న ఆలోచన కూడా అక్కడి వారు చేయరు. అలా ఎవరైనా తీసుకుంటే.. వారిని దరిద్రం వెంటాడుతాదని ఆ గ్రామస్థుల గాఢనమ్మకం.
యూకేలో కొండలపైన ‘పోర్ట్ మేరియన్’ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని పెద్ద పెద్ద చెట్లు కిందకు పడిపోయినట్లుగా వాలి ఉంటాయి. అయితే ఆ చెట్లపై చాలా నాణాలు ఉంటాయట. ఇలా ఈ చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయట. అంతేకాదు.. ఆ చెట్లకు దిగబడి ఉన్న నాణేల్లో ఇప్పడు చెలామణీలో లేవు. ఈ నాణాల చెట్లను చూసేందుకే పర్యాటకులు ప్రత్యేకంగా వెళతారు. 2011వ సంవత్సరంలో ఈ చెట్ల నాణేలు గురించి వెలుగులోకి వచ్చింది. అప్పుడు పరిశోధకులు రంగంలోకి దిగి.. ఇలా చెట్లకు ఎవరు, ఎందుకు నాణాలను మేకుల్లా దిగకొట్టారని తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెట్టారు. చుట్టుపక్కల గ్రామస్థులతో మాట్లాడారు.

 మూఢనమ్మకమా..

మూఢనమ్మకాలు మనిషితో ఏ పని అయినా చేయిస్తాయి..అలాంటిదే ఇది కూడా.. ఈ డబ్బుల చెట్లు స్థానికుల పురాతన సంప్రదాయం , మూఢనమ్మకాల వల్ల ఏర్పడ్డాయి. చెట్టు కాండం లోపల నాణెంను దిగ్గొడితే.. ఆ వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుందని.. మంచి ఆరోగాన్ని ఇస్తుందని కొంతమంది నమ్మకం. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చెట్టులో నాణెం నొక్కితే అది వారి అనారోగ్యాన్ని దూరం చేస్తుందని స్థానికుల నమ్మకం. అంతేకాదు.. ఎవరైనా ఆ నాణేన్ని తిరిగి చెట్టు నుంచి బయటకు తీయాలని చూస్తే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని నమ్ముతారు.

అసలు ఎలా స్టాట్ అయిందంటే..

చెట్లలో నాణేలను పెట్టె సంప్రదాయం 1700 లలో ప్రారంభమైనట్లు సమాచారం.. ఆ చెట్లలో ఉన్న నాణేలు అప్పటికి చెందిన రెండణాలే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా పోర్ట్ మేరియన్ గ్రామస్థులు అప్పట్లోనే చెట్లను దేవతలుగా భావించేవారు.. ఆ కాలంలో ఈ చెట్లని వారు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతలుగా కొలిచేవారట.
దీంతో ఎవరైనా వ్యాధ్యుల బారిన పడితే.. మొక్కుకుని ఇలా ఒక నాణెం తీసుకుని చెట్టుకు మేకులా కొట్టేవారు. ఇలా వేలాది మంది చేయడంతో చెట్లన్నీ నాణాలతో నిండిపోయాయి. అప్పటి ప్రజల్లో అనారోగ్యం పాలైన వ్యక్తి తన చేతులతో తానే ఆ నాణాన్ని చెట్టుకు కొట్టాలన్న నమ్మకం కూడా ఉండేదట. ఈ రోజుల్లో ఎలా అయితో మొక్కుకని చెట్లకు ముడుపు కడతారు…. మనం కూడా ఎ‌వరో కట్టిన ముడుపుని తియ్యం అలానే వాళ్లు కూడా అలా నాణాలను తీయరనమాట.
ఆ నాణాన్ని ఎవరైనా తీసే ప్రయత్నం చేస్తే రోగాలబారిన పడతారని నమ్మేవారు. అందుకే వాటిని తీయడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఇదే విషయంపైనా గ్రామంలో ఈతరం వారు మాట్లాడుతూ.. తమకు ఇప్పుడు ఆ నమ్మకాలు, ఆచారాలు లేవని తెలిపారు.. ఇలా చెట్లకు నాణేలు దింపడం వలన ఎంతవరకూ రోగాలు నయం అయ్యాయో తెలియదు కానీ..ఇప్పుడు ఈ చెట్లను చూడగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఫీలింగ్ కలుగుతుందని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version