ఇంగ్లీష్‌ అక్షరం ‘T’ తో పేరు మొదలయ్యేవారి ప్రత్యేకతలు ఇవే..!!

-

జాతకాలను ఎక్కువమంది బలంగా నమ్ముతారు.. జాతకాల కంటే.. న్యూమరాలజీ ఇంకా పవర్‌ఫుల్‌ అంటుంటారు. సైన్‌ ప్రకారం వీళ్లు చెప్పేవాటికి కొంత సమాధానం ఉంటుంది. న్యూమరాలజీ మొత్తం అంకెలు, అక్షరాల మీదే ఆధారపడుతుంది. ఇంగ్లీష్ అక్షరం Tతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయని న్యూమరాలజీ చెబుతోంది. మీ పేరు కూడా ఇదే అక్షరంతో మొదలైతే.. మీ గురించి న్యూమరాలజీ ఏం చెబుతోందో ఒకసారి చూడండి.. నిజమేనేమో..!
ఆల్ఫాబెట్స్ Tతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు వారి పనులు, ఫలితాలతో పూర్తిగా సంతృప్తి చెందుతారు. తెలివైన మార్గాల ద్వారా విజయాన్ని కోరుకుంటారు. తమ సామర్థ్యంపై వీరికి పూర్తి నమ్మకం ఉంటుంది..అలాగే స్వతంత్రంగా, నిర్ణయాత్మకంగా ఉంటారు. తమ లక్ష్యాల గురించి ఏమాత్రం ఆందోళన చెందరు. ఏ విషయంలోనూ గందరగోళానికి తావు ఉండదు. స్పష్టంగా ఉంటారు. తాము నిర్దేశించుకున్న సూత్రాలు, ఆశయాలకు కట్టుబడి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఐడియాలజీ విషయంలో రాజీపడరు.ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఒక గ్రూప్‌లో ప్రత్యేకంగా, మెరిసే సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంటారు.. అందరి దృష్టిలో పడుతూ.. సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ప్రత్యేకత చాటుకుంటారు.

ప్రత్యేక లక్షణాలు:

వీరికి తమ మతంపై గట్టి నమ్మకం ఉంటుంది. వీరి ఆధ్యాత్మికత వివిధ రూపాల్లో ఉండవచ్చు. వాస్తవానికి వీరు సంప్రదాయ ఆచారాలకు కట్టుబడి ఉండరు. కానీ తమ దేవునికి విధేయులుగా ఉంటారు. ఒక రకమైన ఉదారమైన, దయగల ప్రవర్తన వీరిలో ఉంటుంది.. దీని కారణంగా వారి వ్యక్తిత్వం ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరు ఎప్పుడూ చిరునవ్వుతో ఇతరులకు సహాయం చేయాలని భావిస్తారు. అది వారిని స్పెషల్ పర్సన్‌గా నిలబెడుతుంది.

మహిళలకు ఇలా:

ఆల్ఫాబెట్స్ Tతో పేరు మొదలయ్యే మహిళలు చాలా ప్రతిభావంతులు. వీరి క్రియేటివిటీ అపారం. టీచింగ్, రైటింగ్, డైరెక్షన్, పెయింటింగ్, డ్యాన్సింగ్, చెఫ్..
కౌన్సిలింగ్‌, ఫైనాన్స్ ఎడ్యుకేషన్ , ట్రైనింగ్, పాలిటిక్స్, యానిమేటియో రంగాల్లో బాగా రాణిస్తారు..

కంపెనీలు అయితే..

ఇంగ్లీష్ Tతో పేరు ప్రారంభమయ్యే కంపెనీలు ఉత్పత్తి రంగం కంటే సేవా రంగంపైనే ఎక్కువ దృష్టి సారిస్తే సక్సెస్ అవుతాయి. స్పోర్ట్స్ వంటి సెక్టార్ల కంటే యానిమేషన్ ఇండస్ట్రీ వంటి క్రియేటివ్ ఆర్ట్స్‌ ఈ కంపెనీలను విజయాన్ని ఇస్తాయి..
వీరికి అదృష్ట రంగులు- బ్లూ, వైట్‌, లక్కీ డే- సోమవారం. విరాళాలు- ఆశ్రమాలకు లేదా పేదలకు పాలు లేదా తెల్లని స్వీట్లను దానం చేయండి వీరికి కలిసి వస్తుంది.ఇల్లు లేదా ఆఫీస్ తూర్పు గోడకు వైండ్ చిమ్స్, ఫౌంటెన్ వంటి ఫ్లోటింగ్ వస్తువులను ఉంచడం మంచిది.
గమనిక: న్యూమరాలజీ ప్రకారం చెప్పిందే ఇక్కడ అందించాం కానీ ‘మనలోకం’ సొంతంగా ఊహించుకోని రాయలేదని గమనించగలరు. పాఠకుల ఆసక్తి దృష్ట్యా ఈ ఆర్టికల్‌ను రాయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news