ధనవంతులు ఫాలో అయ్యే పొదుపు అలవాట్లు ఇవేనట..!

-

ధనవంతులు ఫాలో అయ్యే పొదుపు అలవాట్లు ఇవేనట..! ధనవంతులు కావాలని కోరిక ప్రతిమనిషికి ఉంటుంది..ఎవడూ పేదరికంలో బతకాలి అనుకోరు కదా. డబ్బు సంపాదించాలంటే..ముందు డబ్బును పొదుపు చేయటం కూడా తెలిసి ఉండాలి. వచ్చిన డబ్బును కాపాడుకోవటం..దాన్ని రెట్టింపు చేసుకోవటం తెలివైన వాడి లక్షణం. దీనికోసం కొన్ని వదులోకోవాలి.మరికొన్ని పట్టుకోవాలి..పట్టుకుని పాటించాల్సిన పద్దతులేంటో ఇప్పుడు మనం చూద్దాం. మీకు తెలుసా ధనవంతులు కూడా ఇదే పద్దతులు ఫాలో అవుతారట.

బడ్జెట్..

సామాన్య, మధ్యతరగతి ప్రజలే కాదు…పైసలున్న వాళ్లు కూడా..ప్రతీది లెక్కవేసుకునే ఖర్చుపెడతారు. బడ్జెట్ ప్రకారం తమ ఖర్చులను నిర్వర్తిస్తారు. వారు ప్రతినెలా కొంత మొత్తన్ని పొదుపుగా మార్చుకుంటారు. మనం ఎంత డబ్బు ఖర్చు చేసినా దానికి తగ్గట్టుగానే ఆలోచించి బడ్జెట్ మించి ఖర్చులు వచ్చే ప్రతి సారి నియంత్రించుకుంటూ.. ప్లాన్ చేసుకుంటారు. ఖర్చు పెట్టడం అందరూ చేస్తుంటారు. కానీ మన పెట్టే రూపాయి దేనిమీద పెడుతున్నాం..తిరిగి దీని వల్ల మనకు ఎంత వస్తుంది..అసలు ఈ డబ్బును ఖర్చుపెట్టటం వల్ల ఏం పొందుతున్నాం..సుఖమా, ఆనందమా, సంతృప్తా, భద్రత ఏంటి..ఇలా మీరు ఖర్చుపెట్టే ప్రతిసారి మనోవిశ్లేషణ చేసుకుంటే..దుబారా ఖర్చులను నియంత్రించవచ్చు.

రివార్డులు, కూపన్లు..

చాలామందికి వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. కాని కొందరు మాత్రం వీటిని శుభ్రంగా వాడేస్తుంటారు. అందులో మొదటివారు ధనవంతులే ఉంటారు. డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కదా..వీటిని వాళ్లు ఇగ్నోర్ చేయరట. అందినకాడికి ఆఫర్లు, కూపన్స్ రివార్డులతోనే షాపింగ్ కానిచ్చేస్తారు. దాని ద్వారా డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ఫుడ్ ఆర్డర్ చేయడంతో సహా షాపింగ్ చేసేటప్పడు మీకు అందుబాటులో ఉన్న అన్ని కూపన్లు, రివార్డులు బాగా ఉపయోగించుకోండి. పది మిగిలినా మిగిలినట్లే కదా..!

అవసరమైతేనే కొనాలి..

డబ్బు ఉంది కదా..కోరుకున్న ప్రతి వస్తువు కొనరట. ఆ వస్తువు తమకు ఉపయోగపడుతుందా లేదా..అవసరమా అని ఆలోచించి కొనుగోలు చేస్తారు. మనం కూడా..కొన్నిసార్లు నచ్చినవాటిని కొనేస్తుంటాం..వాటి వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు ఆ విషయం మనకూ తెలుసు..అలాంటప్పుడు కొనాలన్న కోరికను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందికదా..మనం ముందు చెప్పుకున్నట్లు..ఏ వస్తువునై కొనే ముందు..అది మనకు అవసరమా కాదా అని ఆలోచించి కొనుగోలు చేయటం ఉత్తమం.

లగ్జరీ కంటే ప్రైవసీ ఎక్కువే

చాలా మంది ధనవంతులు తమ లగ్జరీలైఫ్ ను బయటకు వ్యక్తం చేయరు.అంటే, ఎకానమీ క్లాసులో విమాన ప్రయాణం కంటే కార్ లైఫ్ ను ఇష్టపడతారు. మరికొందరు డ్రైవర్ లేకుండా సొంతంగా కార్లు నడుపుతారు. మీకు ఈఎంఐ బిల్డింగ్ పవర్ లేకపోతే క్రెడిట్ పై ఇంటిని కొనుగోలు చేయవద్దు. రుణాలు లేదా అద్దెకు 40 శాతం కంటే ఎక్కువ ఖర్చు చేయడం తెలివైన పని కాదు.

బ్రాండెడ్ అన్నిసార్లు వద్దూ..

కొంతమంది ధనవంతులు కూడా బట్టలు, బూట్లు, ఫుడ్ వంటి నిత్యావసర వస్తువులకు అవసరమైనంత వరకే ఖర్చు చేస్తారు. డిజైనర్ బట్టలు, బ్రాండెడ్ షూస్ లేదా యాక్సెసరీస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే… మీరు దీనికోసం మాత్రమే ఖర్చే చేసే జాబితాలో ఉన్నట్లయితే, మీరు ఖర్చును తగ్గించుకోవచ్చు.

పెట్టుబడి..

ధనవంతులు తమ పొదుపును పెంచుకోవడానికి తెలివిగా పెట్టుబడి పెడతారు. ఈ అలవాటు ప్రతి లక్ష్యాలను సాధించడానికి లేదా ఖర్చులను తట్టుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది..మీరు కూడా పెట్టుబడి మర్గాలను చూసుకోండి. మన స్థాయిలో లక్షల్లో పెట్టుబడి పెట్టే అంత డబ్బులేకుంటే..బంగారం కొనండి. నిజం మనలాంటి వాళ్లకు బంగారమే మంచి పెట్టుబడి. డబ్బు కావాలంటే..క్షణాల్లో వచ్చేస్తుంది. కాబట్టి సంవత్సరానికి మీ పొదుపుకు తగ్గట్టుగా ఏదైనా గోల్డ్ కొనాలని ప్లాన్ చేసుకోండి.

మీరు కూడా ఈ జాబితాలో ఉండే ఉంటారా. నిజమే వచ్చే శాలరీ EMIలకు ఇంటి అద్దెలకే సరిపోతుందని అందరూ అంటారు. సేవింగ్ కూడా ఒక EMIలా అనుకుని..నెలకు కొంత పక్కన పెట్టుకోవటం అలవాటు చేసుకోండి. శాలరీమీద ఆధారపడి బతికేవాళ్లకు..ఒక నెల జీతం లేట్ అయినా..రాకపోయిన ఎంత ఇబ్బంది పడాలో మనకు బాగా తెలుసు. కరోనా టైంలో అందరూ అనుభవించే ఉంటారు. కాబట్టి ఇకనుంచి అలాంటి పరిస్థితులు రాకుండా ముందునుంచే జాగ్రత్త పడటం ఉత్తమైన లక్షణమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news