గడ్డి గులాబి మొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

గడ్డి గులాబి మొక్క అంటే మీకు తెలియకపోవచ్చు.. కానీ నాచు మొక్క అంటే తెలుసు కదా.. ఇంటి పెరట్లో చాలామంది పెంచుకుంటారు. ఉదయం పూట..వీటికి పూసే పూల భలే అందంగా కనిపిస్తాయి. ఈ మొక్క పూలు వివిధ రంగుల్లో ఉంటాయి. ఎటువంటి నేల‌లోనైనా ఈ మొక్క సుల‌భంగా పెరుగుతుంది. ఈ మొక్క నేల‌పై చాలా పొడ‌వుగా పాకుతూ పెరుగుతుంది. అలాగే ఇది 20 సెంటిమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు పెరుగుతుంది. ఈ గ‌డ్డి గులాబి మొక్క‌లు చాలా సున్నితంగా, మృదువుగా ఉంటాయి. చాలా మంది ఈ మొక్క‌ను ఒక పూల మొక్క‌గానే చూస్తారు త‌ప్ప దీనిని ఔష‌ధ మొక్క‌గా ఎవ‌రూ చూడ‌రు. ఈ మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి.
గ‌డ్డి గులాబి మొక్కకు పూసే పూల‌లో మ‌న చ‌ర్మం ,జుట్టు సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేసే ఔష‌ధ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖం పై మొటిమ‌లు, మ‌చ్చ‌లు, పిగ్మేంటేష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. గ‌డ్డి గులాబి మొక్క ఆకుల‌ను, పువ్వుల‌ను పేస్ట్‌గా చేసి అందులో ఒక ఈ స్పూన్ తేనెను క‌లిపి ముఖానికి ఫ్యాక్‌లా వేసుకోవాలి.
ఈ మిశ్ర‌మం ఆరిన త‌రువాత నీటితో క‌డిగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. గ‌డ్డి గులాబి మొక్క ఆకుల్లో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.
జుట్టు రాల‌డం, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు గ‌డ్డి గులాబి మొక్క ఆకుల‌ను మెత్త‌గా పేస్ట్‌గా చేసి..ఆ త‌రువాత దీనిలో కొబ్బ‌రి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెను క‌లిపి జుట్టుకు ప‌ట్టించాలి. ఒక గంట పాటు త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. వారానికి ఒక‌సారి ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. తెల్ల జుట్టు కూడా న‌ల్ల‌గా మారుతుంది.
గాయాలు త‌గిలిన‌ప్పుడు ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా నూరి గాయాల‌పై ఉంచ‌డం వ‌ల్ల గాయాల నుండి ర‌క్తం కార‌డం త‌గ్గుతుంది. గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి.
గడ్డి గులాబి మొక్కతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలిపారు. మీకు అందుబాటులో ఉంటే ఓ సారి ట్రై చేయండి.!!