చాలా మంది చేసే ఈ తప్పుల వల్లే.. ధనవంతులు అవ్వలేకపోతున్నారు..!

-

చాలా మంది ధనవంతులు అవ్వాలనుకుంటారు, కానీ ధనవంతులు అవ్వలేక పోతారు, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సౌకర్యంతమైన జీవనాన్ని గడపడానికి భవిష్యత్తుకు భద్రత కల్పించడానికి డబ్బు చాలా అవసరం. వీలైనంత ఎక్కువ సంపాదించాలని ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవాలని చాలా మంది చూస్తూ ఉంటారు. అయితే ధనవంతులవ్వాలంటే మాత్రం వీటిని పక్క ఫాలో అవ్వాలి. మనీ మేనేజ్మెంట్ లో బడ్జెట్ పై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. మంచి బడ్జెట్ ప్లానింగ్ చాలా అవసరం అని గుర్తు పెట్టుకోండి. ఎంత సంపాదిస్తున్నారు ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి.

డబ్బులను ట్రాక్ చేయడం ద్వారా డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చూడవచ్చు. ఖర్చుకు ముందు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కి ప్రాధాన్యతనివ్వాలి. చేతికి జీతం అందిన వెంటనే కొంత భాగాన్ని సేవింగ్స్ లో పెట్టాలి. ఆటోమేటిక్ గా డెబిట్ అయ్యే ఆప్షన్స్ ఉపయోగించుకోవచ్చు. మీరు మీ స్థాయిలో జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి మీరు సంపాదించే దానికంటే తక్కువ ఖర్చు చేయాలి అలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు రావు. ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే డబ్బు అంత వేగంగా పెరుగుతుంది.

చిన్న మొత్తాల్లో చేసే పెట్టుబడులు కూడా దీర్ఘకాలికంగా మంచి రిటర్న్స్ ఇస్తాయి. క్రెడిట్ కార్డ్ వంటివి అధిక వడ్డీతో మీరు ఆర్థిక పరిస్థితిని దిగజార్చుకోవడానికి అవుతూంది. లైమ్ లిమిట్ లోపు బ్యాలెన్స్ రీపేమెంట్ చేయకపోతే భారీగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది అలాగే మార్కెట్ ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు మీరు మీ నాలెడ్జ్ ని పెంచుకుంటూ ఉండాలి. మంచి ఆర్థిక నిర్ణయాలను తీసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ కోసం కూడా కొంత అదా చేసుకోవాలి. అలాగే ట్యాక్స్ ఆదా చేసుకోవడం కూడా ముఖ్యం ఇలా వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే ధనవంతులు అయిపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news