అంతా బాగానే ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుందా? ఐతే మీక్కొంచెం ప్రేమ కావాలి.. ఇది తెలుసుకోండి.

కరోనా తర్వాత హ్యాపీగా ఉన్నామని మనస్ఫూర్తిగా చెప్పే వాళ్ళు తక్కువయ్యారు. ఎవ్వరిని కదిలించినా ఏదో ఒక బాధ. కొన్ని సార్లు కొందరికి బాధేంటో తెలియకపోయినా వెలితి మాత్రం ఉంటూనే ఉంది. చాలామంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. చాలామందికి ప్రేమ దూరమయ్యింది. చాలా బంధాలు కరోనా కారణంగా బీటలు వారాయి. తెంచుకునే వరకూ వెళ్ళాయి.

వీటన్నింటి మధ్యలో ఆనందం అనేది మిస్ అయ్యింది. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందోనన్న భయం, ధరలు ఇంకా పెరిగితే ఎలా బ్రతకాలోనన్న బాధ, చేయడానికి ఉద్యోగం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరొకవైపు అంతా బానే ఉంది. కానీ ఏదో కోల్పోయినట్లు భావన. కరోనా తర్వాత మీ జీవితాల్లో ఇలాంటి అనుభవం ఎదురైతే మీకు కావాల్సింది ప్రేమ అని గుర్తుంచుకోండి.

అవును, కరోనా తర్వాత చాలామందికి ప్రేమ దూరమైంది. ఆన్ లైన్ లో డేటింగ్ యాప్స్ ఎన్నో వచ్చినా.. కష్టంగా అనిపించినపుడు పక్కన నిల్చుండి భుజం తట్టేవారు ఒక్కరూ లేరన్న బాధ ఎక్కువైంది. సహాయం అనేది మాటల వరకే పరిమితమైనపుడు ఏమీ చేయలేకపోతున్నాననే బాధ బాగా పెరిగింది. తమని ప్రేమించే వారు లేరన్న దిగులు ఎక్కువైంది. మరి దీనికి ఏం చేయాలి?

ప్రేమ బాధ నుండి ఎలా బయటపడాలి?

దీనికి ఒక్కటే మార్గం. వాట్సాప్, ఫేస్ బుక్, ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ అన్నీ పక్కన పెట్టండి. ఒకవేళ కామ్ అయిపోండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. కొత్త ప్రదేశాలకు వెళ్ళండి. ప్రస్తుతం పర్యాటక ప్రాంతాలు తెరుచుకుంటున్నాయి. కొద్దిగా ఖర్చు అయినా ఫర్వాలేదు పర్యాటకానికి వెళ్ళండి. ప్రకృతితో మమేకం అవ్వండి. అప్పటివరకూ ఉన్న డైలీ రొటీన్ ని పూర్తిగా మార్చేయండి. ఆహారపు అలవాట్ల దగ్గర నుండి అన్నింటినీ మార్చండి. అప్పుడు మీకో కొత్త జీవితం కనిపిస్తుంది. అదే మీకు కావాల్సిన ప్రేమను మీకందిస్తుంది.