బాబోయ్ ఏంటీ ఇవి సంప్రదాయాలా..? చూస్తే మతి పోతుంది..!

-

చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ప్రతి దేశంలో కూడా కొన్ని రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. చాలా దేశాలు విచిత్రమైన పద్ధతుల్ని కూడా అనుసరిస్తూ ఉంటాయి. ఇవి చూసారంటే మీరు కూడా షాక్ అవుతారు.

లా టమాటిన:

ఇది ఒక స్పానిష్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ లో ఏం చేస్తారంటే టమాటాలని విసురుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫుడ్ ఫైట్ లో పెద్దది. 1940 నుంచి కూడా ఈ ఫెస్టివల్ ని జరుపుతున్నారు.

టొసింగ్ టీత్:

ఊడిపోయిన పళ్ళను గ్రీస్ లో పిల్లలు విసిరి ఏదైనా కోరికను కోరుకుంటారు. ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని బలంగా నమ్ముతారు.

ఉమ్మడం, అభినందనలు తెలపడం:

మామూలుగా ఉమ్మితే ఎవరైనా కోప్పడతారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఒకరి మీద ఉమ్మి వాళ్లకు ఆశీర్వాదాలు ఇస్తారు. పెళ్లి కూతురుకైనా అప్పుడే పుట్టిన పిల్లలకైనా కూడా ఇలా చేస్తారు. ఇది కెన్యా, టాంజానియా, ఆఫ్రికన్ గ్రేట్ లేక్స్ ప్రాంతాల్లో జరుగుతుంది.

చప్పుడు చేస్తూ తినడం:

తినేటప్పుడు చప్పుడు చేస్తూ తినడం అనేది చూడడానికి బాగుండదు కానీ ఇక్కడ జపాన్లో మాత్రం మొత్తం వ్యతిరేకం. ఎంత గట్టిగా శబ్దం చేసుకుంటూ తింటే అంత బాగా పొగుడుతారు.

కిస్సింగ్:

ఫ్రాన్స్ లో కిస్సింగ్ ఒక పద్ధతి. ఫ్రెంచ్ వాళ్ళు ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పాలంటే ముద్దులు పెట్టి శుభాకాంక్షలు తెలుపుతారు. అది తెలియని వ్యక్తులకు అయినా సరే.

భార్యను ఎత్తుకెళ్లడం:

ప్రతి ఏడాది ఫిన్లాండ్లో ఈ పోటీని జరుపుతారు. ఇందులో గెలిచిన వాళ్ళకు భార్య ఎంత బరువు ఉంటే అన్ని కేజీల బీర్ ఫ్రీగా ఇస్తారు.

దాల్చిన చెక్క:

డెన్మార్క్ లో 25 ఏళ్ల వచ్చిన వ్యక్తికి కుటుంబ సభ్యులు స్నేహితులు వాళ్ళ మీదకి దాల్చిన చెక్కని విసురుతారు. ముందు వాళ్ల మీద నీళ్లు జల్లి ఆ తర్వాత వాళ్లను తల నుంచి పాదాల వరకు దాల్చిన లో ఉంచుతారు. వంద ఏళ్ల నుంచి పాటిస్తున్న పద్ధతి ఇది.

Read more RELATED
Recommended to you

Latest news