కరోనా సోకిన చాలా మంది ఇండ్లలో ఉండే చికిత్సను తీసుకుంటున్నారు. ఇక అత్యవసర స్థితి ఉన్నవారికి హాస్పిటల్స్‌లో చికిత్సను అందిస్తున్నారు. అయితే కోవిడ్ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇంట్లో ఉండి తాను చెప్పిన విధంగా ఓ నూతన తరహా కాన్సెప్ట్‌ను పాటిస్తే కోవిడ్ నుంచి త్వరగా బయట పడవచ్చని ఓ వైద్యాధికారి చెబుతున్నారు. ఇంతకీ ఆయన చెబుతున్న కాన్సెప్ట్ ఏమిటంటే..?
బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్‌కు చెందిన డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ అనిల్ కుమార్ D-LAMP, M3 PHC అనే కాన్సెప్ట్‌తో ఇంటి వద్ద ఉన్న కోవిడ్ పేషెంట్లకు చికిత్సను అందిస్తున్నారు. ఇందులో D-LAMP అంటే.. Dexamethasone, Low molecular weight heparin injection, Azithromycin, Montelukast, Paracetamol అని అర్థం. ఇవన్నీ ట్యాబ్లెట్లు. డాక్టర్ల సూచన మేరకు ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకునే కోవిడ్ పేషెంట్లు ఈ మెడిసిన్‌ను వాడాలి.
అలాగే M3 PHC అంటే… M3లో మాస్క్, మల్టీ విటమిన్, మౌత్ గార్గిల్ అని అర్థాలు వస్తాయి. పి అంటే ప్రోనింగ్. బోర్లా పడుకుని ఆక్సిజన్ లెవల్స్‌ను పెంచుకోవాలి. హెచ్ అంటే హ్యాండ్ వాష్, సి అంటే చెస్ట్ ఫిజియోథెరపీ అని అర్థాలు వస్తాయి. ఇలా వీటిని పాటిస్తే కోవిడ్ నుంచి త్వరగా బయట పడవచ్చు. ఇలా అనిల్ కుమార్ ఇప్పటికే 6000 మందికి కోవిడ్‌ను నయం చేశారు. డాక్టర్ల సూచన మేరకు పైన తెలిపిన కాన్సెప్ట్‌ను పాటిస్తే కోవిడ్ నుంచి త్వరగా బయట పడవచ్చని ఆయన తెలిపారు.