గూగుల్ సెర్చ్ లో టాప్ ఫుడ్ చికెన్ బిర్యాని…!

-

చికెన్ బిర్యానీ 2019 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ ఆహారంగా నిలిచింది. ప్రతి నెలా సగటున 4.56 లక్షల చికెన్ బిర్యాని గురించి సెర్చ్ చేసినట్టు ఒక సర్వే వెల్లడించింది. బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోస, తందూరి చికెన్, పాలక్ పన్నీర్, నాన్, దాల్ మఖాని, మరియు చాట్ కూడా టాప్ 10 సెర్చ్ లో ఉన్నాయి. పంజాబీ వంటకం అయిన బటర్ చికెన్ ని సగటున దాదాపు నాలుగు లక్షల సార్లు సెర్చ్ చేసారట.

సమోసాను సగటున 3.9 లక్షల సార్లు సెర్చ్ చేసారు. మరో పంజాబీ వంటకం చికెన్ టిక్కా మసాలా సగటున 2.5 లక్షల సార్లు సెర్చ్ చేసినట్టు SEMrush వెల్లడించింది. దక్షిణ భారత వంటకం, దోస సగటున 2.28 లక్షల సార్లు శోధించబడింది. జాబితాలో తదుపరి ఐదు ఆహార పదార్థాలు: తందూరి చికెన్, పాలక్ పన్నీర్, నాన్, దాల్ మఖానీ, మరియు చాట్ కూడా ఎక్కువగా సెర్చ్ చేసారు.

SEMrush కమ్యూనికేషన్స్ హెడ్ ఫెర్నాండో అంగులో మాట్లాడుతూ… “విదేశాలలో నివసిస్తున్న భారత ప్రవాసులు దాని ప్రాధాన్యతలను స్థిరపడిన ప్రతిచోటా తీసుకువెళ్లారు. విదేశాలలో నివసిస్తున్న వారిలో గణనీయమైన సంఖ్యలో పంజాబీలు ఉన్నందున, వారు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్నాక్స్ విషయానికొస్తే, స్పైసీ మరియు సుగంధ సమోసా మరియు చాట్ ఆన్‌లైన్‌లో ఎక్కువగా సెర్చ్ చేసారట.

Read more RELATED
Recommended to you

Latest news