దక్షిణ లండన్ లో జరిగిన ఉగ్రవాద ఘటనలో కాల్చి చంపిన ఉదేశ్ అమ్మన్ అనే వ్యక్తి గురించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అతను చిన్న వయసులోనే ఉగ్రవాద కార్యాకలాపలకు పాల్పడినట్టు చెప్పిన పోలీసులు చిన్న వయసులోనే ఇస్లామిక్ మత ప్రచారం చేసినందుకు గాను జైలు శిక్ష అనుభవించాడని అధికారులు చెప్పారు. అదే విధంగా మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు.
తన స్నేహితురాలి తల్లి తండ్రుల తలలు నరకమని అతను ప్రోత్సహించాడని అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 2018 లో అతను ఉగ్రవాద కార్యాకలాపాలను మొదలుపెట్టాడని, తన తల్లి మరియు చెల్లెళ్ళతో కలిసి అతను ఉగ్రవాద కార్యాకలాపలకు పాల్పడ్డాడని, ఈ క్రమంలో అతను ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకుని అందుకు వినియోగించాడని అధికారులు వివరించారు.
ఇక అతను తనపై నిఘా పెట్టిన ఇద్దరు పోలీసులను కూడా కాల్చి చంపాడని అధికారులు వివరించారు. 2018 ఏప్రిల్‌లో అతని కార్యకలాపాల గురించి పోలీసులకు సమాచారం అందింది అని, ఒక నెల తరువాత అతన్ని ఉత్తర లండన్ వీధిలో అధికారులు అరెస్ట్ చేసారని వెల్లడించారు. ఇక ఆ సమయంలో అతని కంప్యూటర్లు మరియు ఫోన్‌ను పరిశీలించినప్పుడు సంచలన విషయాలు బయటపెట్టారు.
అతను పేలుడు పదార్థాలు తయారు చేయడం మరియు ఉగ్రవాద దాడులకు సంబంధించిన విషయాలను డౌన్‌లోడ్ చేసినట్లు వారు కనుగొన్నారు. ఇక తన కుటుంబాన్ని కూడా ఉగ్రవాద చర్యలకు ప్రోత్సహించాడని, తన అభిప్రాయాలను వాళ్ళ ముందు చర్చించాడని, అదే విధంగా తరుచుగా కత్తి వాడక౦కి సంబంధించి అతను శిక్షణ పొందాడని అధికారులు వివరించారు.