శృంగారం: ఏ ముద్దు ఏ ఉద్దేశ్యంతో పెడతారో తెలుసా?

శృంగారంలో ముద్దుకి చాలా ప్రాధాన్యం ఉంది. ముందు ముద్దుతో మొదలయ్యి, ఆ తర్వాత హద్దులన్నీ చెరిపేసి, శిఖరాన్ని చేరుకోవాలి. అప్పుడే శృంగారాన్ని ఆనందించగలరు. ప్రస్తుతం, ముద్దుల్లో రకాల గురించి తెలుసుకుందాం. మగాళ్ళు ఆడవాళ్ళకిచ్చే ముద్దుల్లో వారి ఉద్దేశ్యం ఏమై ఉంటుందనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముద్దు పెట్టే చోటుని బట్టి వారి ఇంటెన్షన్ ఏమై ఉంటుందనేది ఇక్కడ చూద్దాం.

 

పెదవులపై

మీ భాగస్వామి మీ పెదాలపై ముద్దు పెడితే అది వారి ప్రేమను తెలియజేస్తుంది. జస్ట్ పెదాలను టచ్ చేసి వారి ప్రేమను తెలియజేస్తారు. అది ఇంట్లో అయినా సరే, లేదా బయట ఐనా సరే.

చెంపపై

చెంప మీద ముద్దు పెట్టిన వారు ఉద్దేశ్యం రొమాన్స్ కి దారి తీయడం కాదు. కేవలం నీకు నేనున్నానని తెలియజేయడం మాత్రమే అయి ఉంటుంది.

నుదుటిపై

నుదుటి మీద వెచ్చని ముద్దు వారి సిన్సీయారిటీని తెలుపుతుంది. తాను కూడా నీలో ఒక భాగమని, నువ్వూనేనూ ఒకటే అనే భావన వారిలో కలిగి ఉంటుంది.

మెడపై

మెడపై పెట్టే ముద్దులో అవతలి వారికి మీపై కోరిక ఎక్కువగా ఉంటుంది. మీకోసం పడి చచ్చిపోయేంత ప్రేమలో ఉంటారు. మెడమీద పెట్టే ముద్దు రొమాన్స్ కి దారి తీస్తుంది.

చేయిపై

చేతిమీద ముద్దు పెట్టే వాళ్ళు అవతలి వారిని ఇంప్రెస్ చేయాలని అనుకుంటారు. తమకోసం పరితపింప చేసుకోవాలని అనుకుంటారు.

ఫ్రెంఛ్ కిస్

ఫ్రెంఛ్ కిస్ అనేది విపరీతమైన కోరికలోంచి పుట్టుకు వస్తుంది. మిమ్మల్ని బాగా కావాలనుకుని ఈ కిస్ ఇస్తారు. ఈ ప్రపంచంలో ఆ క్షణం వారికేమీ పట్టదు. కేవలం మీకోసం మాత్రమే చూస్తారు.