నాన్ సెన్స్… అంత డబ్బు పెట్టి విగ్రహాన్ని నిర్మిస్తారా? భారత్ పై యూకే ఫైర్..!

-

టోటల్ నాన్ సెన్స్… 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం గురించే వాళ్లు మాట్లాడేది. బ్రిటీష్ ఎంపీ పీటర్ బోన్ మాటలు ఇవి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పీటర్.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నాన్సెన్స్ అంటూ విమర్శించారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

మా దగ్గర నుంచి ఇప్పటి వరకు 1.1 బిలియన్ పౌండ్స్ విదేశీ సాయాన్ని భారత్ తీసుకున్నది. అంటే మన కరెన్సీలో దాదాపు 11 వేల కోట్లు. అదే సమయంలో 330 మిలియన్ పౌండ్స్ ను(3000 కోట్లు) విగ్రహ నిర్మాణం కోసం ఖర్చు చేయడమనేది నాన్ సెన్స్ అంటూ ఎంపీ విమర్శించారు. గత ఐదేళ్లలో విదేశీ సాయం కింద భారత్ కు 1.17 బిలియన్ పౌండ్స్ ఇచ్చిందట. అంటే 9492 కోట్లు. అయితే.. ఆ నిధులు ఇచ్చింది సమాజ సేవ కోసం, మహిళల హక్కుల సమస్యల పోరాటం కోసం, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల కోసం, మత సంయమనం కోసం కానీ.. ఇలా విగ్రహాలు నిర్మించుకోవడం కోసం కాదు అంటూ ఎంపీ మండిపడ్డారు.

“అయినా.. వాళ్ల డబ్బులను వాళ్లు ఎలా అయినా ఖర్చు పెట్టుకోని. కానీ.. వాళ్లకు విగ్రహం నిర్మించుకునే శక్తి ఉన్నప్పుడు వాళ్లకు మానుంచి ఎటువంటి సాయం అవసరం లేదని మేం అనుకుంటున్నాం..” అంటూ ఆయన ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన మిగితా ఎంపీలు కూడా ఇండియాకు ఇక నుంచి విదేశీ సాయం అందించకూడదని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version