తెలంగాణ రైతు బంధుకు ఐక్యరాజ్యసమితి ఫిదా…!

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ రైతన్న పెట్టుబడి సాయం కోసం ఒకరి దగ్గర చేయి చాపొద్దని.. రైతన్నకు దురదృష్టవశాత్తు ఏదైనా అయితే.. రైతన్న ఫ్యామిలీని ఆదుకోవడం కోసం ప్రవేశపెట్టిన పథకాలు రైతు బంధు, రైతు బీమా. ప్రపంచంలోనే ఏ ప్రభుత్వమూ ఇంతవరకు అటువంటి పథకాలను ప్రారంభించలేదు. అందుకే ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. చివరకు కాంగ్రెస్ పార్టీ కూడా తమ మ్యానిఫెస్టోలో రైతు బంధు, రైతు బీమా పథకాలను చేర్చిందంటే… అది ఆ పథకాల గొప్పతనం.

తాజాగా ఈ పథకాలు మరో మెట్టు పైకి ఎక్కాయి. ఐక్యరాజ్యసమితి వీటికి గుర్తింపునిచ్చింది. ఫుడ్ అంట్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) ఈ పథకాలపై రీసెర్చ్ చేసింది. త్వరలో ఎఫ్ఏవో నిర్వహించనున్న సదస్సులో ఈ పథకాల గురంచి చర్చించనుంది. ఈనెల 21 న రోమ్ లో జరగనున్న ఇంటర్నేషన్ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన వినూత్న వ్యవసాయ పథకాల గురించి చర్చించనుంది. వాటిలో తెలంగాణ నుంచి రైతు బంధు, రైతు బీమా పథకాలు కూడా చోటు సంపాదించడం విశేషం. రైతు బంధు, రైతు బీమా పథకాలపై ఆ సదస్సులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారధి ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version