ఎగిరే కార్ల కోసం అర్బన్ ఎయిర్ పోర్ట్.. నవంబర్ లో ప్రాజెక్టుకు శ్రీకారం..!

-

భవిష్యత్ లో జరిగే పరిణామాలను ఇప్పటికే మనం కొన్ని సినిమాలల్లో చూసి ఉంది. ఆ సినిమాల్లో అత్యాధునిక హంగులతో భవనాలు, రోబో మనుషులు, సూపర్ స్పీడ్ టెక్నాలజీ, ప్రయాణించడానికి ఎగిరే కార్లను చూసే ఉంటాం. వాటిని చూసినప్పుడల్లా భవిష్యత్ ఇలా ఉండబోతుందా అనే ఉత్సుకత మదిలో నెలకొంటుంది. ఫ్లయింగ్ కార్లతో నచ్చిన ప్రదేశానికి ఎగిరేయ్యవచ్చు. అలాంటి రోజులు తొందరగా వస్తే బాగుండు అని కలలు కనే వారు కూడా ఎక్కువే. ఇలాంటి కలను తీర్చుకునే రోజు తొందర్లోనే రాబోతోంది. ఫ్లయింగ్ కార్లతో భవిష్యత్ లో మనం మరో కొత్త తరహా రవాణా సదుపాయాలను చూడనున్నాం.

urban airport

ట్రాఫిక్ సమస్య లేకుండా ఎగిరే కార్లలో దూసుకుపోవాలని అనుకునే వారి కల త్వరలో నెరవేరనుంది. ఇప్పటికే పలు సంస్థలు ఎయిర్ ట్యాక్సీల తయారీలో బిజీ అయ్యాయి. వాటిలో కొన్ని ప్రయోగాత్మకంగా విజయవంతం అయ్యాయి. అయితే ఎగిరే కార్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ, యూకే (యునైటెడ్ కింగ్ డమ్) ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే తొలి అర్బన్ ఎయిర్ పోర్టును ఈ ఏడాది చివరి నెలల్లో అందుబాటులోకి తీసుకురానుంది.

ఎయిర్ ట్యాక్సీల కోసం అర్బర్ ఎయిర్ పోర్టును ప్రారంభించనుంది యూకే ప్రభుత్వం. దీని కోసం రూ.87,488,700 కోట్ల (1.2 మిలియన్ పౌండ్లు) బడ్జెట్ ను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన బాధ్యతలను హ్యుందాయ్ సంస్థకు అప్పగించింది. కోవెంట్రీలోని యూకే సిటీ ఆఫ్ కల్చర్ ప్రాంతంలో అర్బన్ ఎయిర్ పోర్టును ఈ ఏడాది నవంబర్ లో ప్రారంభించనుంది.

ఎగిరే కార్లు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టనుంది. అయితే ఈ ఎయిర్ ట్యాక్సీలు (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్) వాహనాలపై అవగాహన కల్పించే కేంద్రాలను ప్రారంభించారు. వీటితో ఎయిర్ ట్యాక్సీలను గురించి ఇప్పటి నుంచే అవగాహన అందించనున్నారు. అర్బర్ ఎయిర్ పోర్ట్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిసాంధు మాట్లాడుతూ..‘‘ వాహనాలకు రోడ్లు కావాలి.. రైళ్లకు పట్టాలు ఎలాగో.. ఈ ఎయిర్ ట్యాక్సీలకు అర్బన్ ఎయిర్ పోర్టులు అలా. వీటి ద్వారా దేశంలోని అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. భూమి మీదే కాకుండా నీటిపై తేలియాడే డాక్స్ కూడా ఏర్పాటు చేసి.. ఎగిరే ట్యాక్సీలకు ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించనున్నాం.’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అర్బన్ ఎయిర్ పోర్టుకు సంబంధించిన ఎయిర్ ట్యాక్సీల గురించి ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో అర్బన్ ఎయిర్ పోర్టు గురించి సవివరంగా వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news