అక్కడ దీపికా పదుకొనె దోశ లభిస్తుంది..!

-

US restaurant has dosa named after Deepika Padukone

అవునా.. అడ్రస్ చెప్పండి.. వెంటనే వెళ్లి దీపికా పదుకొనె వేసిన దోశను తినేస్తాం అంటారా? అది దీపికా పదుకొనె వేసిన దోశ కాదు. దోశకు ఆమె పేరు పెట్టారు అంతే. యూఎస్ లోని దోశా ల్యాబ్స్ అనే రెస్టారెంట్ ఇలా దీపికా పదుకొనె దోశను తన మెనూలో చేర్చింది. ఆ మెను కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. అదొక్కటే కాదు.. పూణెలోని ఓ రెస్టారెంట్ లో కూడా దీపికా పదుకొనె పరోటా తాలిని అమ్ముతున్నారట. దానికి సంబంధించిన మెనూ కార్డు కూడా వైరల్ గా మారింది. తన పేరుతో ఉన్న మెను కార్డులను దీపికా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ మస్తు ఖుషి అయింది.

తన వైఫ్ పేరు మీద మాంచి డిష్ ఉంటే రణ్ వీర్ సింగ్ ఊరుకుంటాడా? హేయ్.. నేను ఆ దోశను తినేస్తా అంటూ ఫన్నీగా క్యాప్సన్ పెట్టాడు రణ్ వీర్. ఏంటి రణ్ వీర్.. నువ్వు కాకుంటే ఆ దోశను ఇంకెవరు లాగించేస్తారు చెప్పు.

Read more RELATED
Recommended to you

Exit mobile version