చిప్స్ ప్యాకెట్.. సగం గాలి.. సగం చిప్స్ తో వస్తుంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ ప్యాకెట్ మొత్తం గాలితోనే వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది. తాజాగా గోవాలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆకలిగా ఉంది అనో ఓ వ్యక్తి గోవాలో 10 రూపాయల చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఇక తిందాం అని ఓపెన్ చేస్తే అందులో ఉన్నవి కేవలం నాలుగంటే.. నాలుగే చిప్స్.
దాంతో అవకైనా ఆయా వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆ చిప్స్ ప్యాకెట్ ఫోటోలను షేర్ చేస్తూ పంచుకున్నాడు. అయితే ఆయా పోస్ట్ వైరల్ కావడంతో జనాల వద్ద నుండి హిలేరియస్ కామెంట్స్ వచ్చాయి. నువ్వు డబ్బులు ఇచ్చింది అందులో ఉండే గాలికి.. అనుకోకుండా చిప్స్ వచ్చాయి అని ఒక్కరు అంటే.. డబ్బు సంపాదించడానికి ఇచ్చి మంచి అవకాశం.. ఈ ఘటనపై కంప్లెన్ట్ చెయ్యి అని మరో వ్యక్తి కామెంట్స్ చేసారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ నాలుగు చిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.