18 ఏళ్లలోపు వున్న పిల్లలు గూగుల్ సెర్చ్ లో వాళ్ళ ఫోటోలని తొలగించమని అడగొచ్చు..!

-

ఇంటర్నెట్ సురక్షితంగా ఉండాలని గూగుల్ కొత్త పాలసీలు తీసుకు రావడం జరిగింది. ఈ పాలసీల ప్రకారం మనం చూసినట్లయితే.. పిల్లలకి ఎక్కువగా కంట్రోల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి సులువుగా చెప్పాలంటే… 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి గూగుల్ సెర్చ్ నుంచి వాళ్ళ ఫోటోలు ఏమైనా తొలగించాలంటే రిక్వెస్ట్ పెట్టొచ్చు అని చెబుతోంది.

ఒకవేళ కనుక చిన్న పిల్లలు అప్లికేషన్ ని ఫిల్ చేయలేకపోతే తల్లిదండ్రులు లేదా ఎవరైనా సరే వాళ్లకి సాయం చేయొచ్చు అని చెబుతోంది. గూగుల్ ఏది ఏమైనా ఫోటో ని తొలగిస్తుంది కానీ వెబ్ నుండి పూర్తిగా తొలగించడం జరగదు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళకి ఇలా రిక్వస్ట్ పెట్టడానికి కొత్త పాలసీలు తీసుకువచ్చింది.

గూగుల్ మామూలుగా అయితే 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లకి గూగుల్ ఎకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వదు. అయితే ఇప్పుడు గూగుల్ తన యాప్స్ లో కొన్ని మార్పులు తీసుకు వస్తోంది. యూట్యూబ్, గూగుల్ సెర్చ్ ఆప్, గూగుల్ అసిస్టెంట్ మరియు మిగిలిన వాటిలో కూడా పలు మార్పులు చేస్తోంది. గూగుల్ ఇప్పుడు సర్చ్ ప్రొటెక్షన్ ని ఇస్తోంది అదేవిధంగా తల్లిదండ్రులు స్క్రీన్ టైం లిమిట్ పెట్టే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. వీటిపై గూగుల్ ఇప్పుడు పనిచేస్తోందని.. రానున్న రోజుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news