కొన్ని జ్ఞాపకాలు చిరకాలం గుర్తుండి పోతాయి. గతంలోని అనుభవాలు, అనుభూతులను ప్రస్తుత కాలంలో పోల్చుతూ అభివర్ణిస్తుంటే కన్నీళ్లు పెట్టుకోని వారుండరూ. వీటిలో కొన్ని మధుర జ్ఞాపకాలు ఉంటే.. మరికొన్ని చేదు జ్ఞాపకాలుగా మారి గుండెను చలింపజేస్తుంటాయి. ఇలాంటి అనుభవాలను చాలా మంది సోషల్ మీడియాలో పంచుకోవడం చూస్తూనే ఉంటాం. కొందరు చిన్నప్పుడు దిగిన ఫోటోలను.. మధ్య వయస్కుకు వచ్చినప్పుడు దిగిన ఫోటోలను షేర్ చేస్తుంటారు. అందులో చిన్నప్పుడు ఇంత క్యూట్‌గా ఉన్నాను.. ఇప్పుడు ఇలా ఉన్నానని ఫన్నీగా పోస్ట్ చేస్తుంటారు.
కరోనా కారణంగా ఏడాది మొత్తం ప్రపంచం చీకట్లోనే గడిపింది. ఇంటి గడప దాటని సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. కరోనా సమయంలో సిన్సినాటి జూలో ఓ చీతా జన్మించింది. జంతు సంరక్షణ వాళ్లు ఆ చీతాకు క్రిష్ అని పేరు కూడా పెట్టారు. జూ కీపర్ చిన్నప్పుడు క్రిష్ కాలిని చేతిలో పట్టుకుని దిగిన ఫోటో.. ప్రస్తుతం యంగ్ ఏజ్‌లో ఉన్న క్రిష్ ఫోటోను యాడ్ చేసి సిన్సినాటి జూ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
సిన్సినాటి జూ ట్విట్టర్ ఖాతాలో క్రిష్ చిన్నప్పుడు తీసిన పంజా.. పెద్దవాడయ్యాక తీసిన పంజా ఫోటోలను షేర్ చేశారు. దీనికి క్యాప్షన్ కూడా పెట్టారు. ‘‘ఇది ఎలా ప్రారంభమైంది.. ఎలా జరిగింది.’’ అని ఆశ్చర్యంగా చెప్పుకొచ్చారు. క్రిష్ చూస్తుండగానే పెద్దవాడయ్యాడని సిన్సినాటి జూ పేర్కొంది.
జనవరి 26వ తేదీన క్రిష్ ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లో ఫోటో వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చిన్న వయసు నుంచి యుక్త వయసుకు చేరుకున్నావని, చాలా అందంగా ఉన్నావ్.. ఐ లవ్ యూ.. క్రిష్ అని, పెరిగిన పిల్లాడని, ఓరి దేవుడా.. ఎంత క్యూట్‌గా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఈ మేరకు సిన్సినాటి జూ క్రిష్ యంగ్ ఏజ్‌లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది.
Kris the cheetah is getting so big! 😻 pic.twitter.com/dBJvXBFyzo
— Cincinnati Zoo (@CincinnatiZoo) January 26, 2021