రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు దుమ్ముదులిపిన నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవలే ఒరిజినల్ సాంగ్ కేటగిరి లో ఆస్కార్ ను అందుకుంది..గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. ఇప్పుడు ఆస్కార్ అవార్డు తో మరింత పెరిగింది..ఈ క్రమంలో ఎందరో నటులు, క్రీడాకారులు, ప్రముఖులు ఈ పాటకు స్టెప్పులేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా నాటు నాటు పాటకు తన కాలు కదిపాడు..
లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లో ఎంతో ఉత్సాహంగా, దూకుడుగా ఉండే కోహ్లీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో.. ఫీల్డింగ్ చేస్తూ నాటు నాటు స్టెప్పులేశాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకా దీనిపై అటు ఆర్ఆర్ఆర్ అభిమానులు, క్రీడాభిమానులు, ఇటు నెటిజన్లు లైకులు, కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.
శుక్రవారం టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో ఆసీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అటు మైదానంలోని ఆటగాళ్లను, ఇటు క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు. ఇక కోహ్లీ వేసిన స్టెప్పుల వీడియో ఆర్ఆర్ఆర్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ అయింది..ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇద్దరూ కలిసి పఠాన్ మూవీ టైటిల్ ట్రాక్‌పై స్టెప్పేసిన సంగతి తెలిసిందే.. ఇందుకు సంబందించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి..ఇప్పుడు విరాట్ డ్యాన్స్ వీడియో కూడా వైరల్ అవుతుంది..