మున్నార్ వెళ్తున్నారా..? ఈ ప్ర‌దేశాల‌ను చూడ‌డం మ‌రువ‌కండి..!

-

మున్నార్‌… కేర‌ళ‌లోని ముఖ్య‌మైన ప‌ర్యాటక ప్ర‌దేశాల్లో ఇది కూడా ఒక‌టి. ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌తో ఎప్పుడూ అల‌రారుతూ ఉంటుంది. ఎటు చూసినా ప‌చ్చ‌ని చెట్లు, ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, కొండ చ‌రియ‌లు.. ప‌ర్యాట‌కుల‌కు మ‌ధుర‌మైన అనుభూతుల‌ను క‌లిగిస్తుంటాయి. కేర‌ళ రాజ‌ధాని కొచ్చికి 130 కిలోమీట‌ర్ల దూరంలో మున్నార్ ఉంది. అయితే ప‌ర్యాట‌క ప్రేమికులు మున్నార్‌లో చూడ‌ద‌గిన అందాలు, ఆస్వాదించ‌ద‌గిన అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మౌంటేన్ బైకింగ్
మున్నార్‌ను సంద‌ర్శించే ప‌ర్యాట‌కులు చాలా మంది అక్క‌డి మౌంటేన్ బైకింగ్‌ను అనుభూతి చెందుతారు. ప‌చ్చ‌ని ప‌ర్వ‌తాల‌పై బైకింగ్ చేస్తే వ‌చ్చ కిక్కే వేరేగా ఉంటుంది. సాహిసికులు ఎక్కువ‌గా మున్నార్‌లో మౌంటేన్ బైకింగ్ అడ్వెంచ‌ర్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. క‌నుక మీరు కూడా ఎప్పుడైనా మున్నార్ వెళితే.. త‌ప్ప‌క ఈ సాహ‌సాన్ని ట్రై చేయండి.

2. వైల్డ్ లైఫ్ స‌ఫారి
మున్నార్‌లోని ఎర‌వికులం నేష‌న‌ల్ పార్క్ 97 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఏటా ఇక్క‌డి వైల్డ్ లైఫ్ స‌ఫారి కోసం ఎంతో మంది ప‌ర్యాట‌కులు విచ్చేస్తుంటారు. అనేక ర‌కాల జీవ‌వైవిధ్యం ఉన్న ప్రాణుల‌కు ఈ పార్కు నిల‌యంగా మారింది. మున్నార్ లో ఉన్న చూడ‌ద‌గిన ప్ర‌దేశాల్లో ఇదొక‌టి.

3. శిఖ‌ర రైడ్
కుంద‌ల స‌ర‌స్సులో ఈ రైడ్ ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంది. ప‌చ్చ‌ని కొండ‌చ‌రియ‌లు, ద‌ట్ట‌మైన చెట్లతో ఉన్న అర‌ణ్యం మ‌ధ్య‌లో అత్యంత చీక‌ట్లో ఈ రైడ్ సాగుతుంది. సాహసికులు ఇక్క‌డ గొప్ప అనుభూతి చెంద‌వ‌చ్చు.

4. ఆయుర్వేద స్పా
ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌కృతి వాతావ‌ర‌ణంలో గ‌డిపితే అన్ని ఆందోళ‌న‌లు పోతాయి. ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అందుకే మున్నార్ లో ప‌ర్యాట‌కుల‌కు ఆయుర్వేద స్పాలు స్వాగతం ప‌లుకుతుంటాయి.

5. క‌థ‌క‌ళి
కేర‌ళ‌కు చెందిన సంప్ర‌దాయ నృత్యాల్లో క‌థ‌క‌ళి ఎంతో పేరుగాంచింది. నైపుణ్యం ఉన్న క‌ళాకారులు ప్ర‌దర్శించే నృత్యాన్ని క‌చ్చితంగా ప‌ర్యాట‌కులు చూడాల్సిందే. వారి లైవ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ప‌ర్యాట‌కుల క‌ళ్ల‌ను క‌ట్టి ప‌డేస్తాయి.

6. రాక్ క్లైంబింగ్
మున్నార్‌లో రాక్ క్లైంబింగ్ కూడా చాలా ఫేమ‌స్సే. ఇక్క‌డికి వ‌చ్చే అనేక మంది ప‌ర్యాట‌కులు ప‌చ్చని కొండ‌చ‌రియ‌ల‌పైకి ట్రెక్కింగ్ చేస్తారు. సాహ‌సంతో కూడిన యాత్ర‌లు చేస్తారు.

7. ఎలిఫెంట్ పార్క్
కార్మెల‌గిరిలో ఉన్న ఏనుగుల పార్క్ మున్నార్ ద‌గ్గ‌ర‌ చాలా ప్ర‌సిద్ధి గాంచింది. ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఏనుగుల‌ను చూస్తూ విహ‌రించ‌వ‌చ్చు.

8. టీ ప్లాంటేష‌న్
మున్నార్‌లోని కొలుక్కుమ‌లై టీ ప్లాంటేషన్ చ‌క్క‌ని ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త‌కు అద్దం ప‌డుతుంటుంది. ఇక్క‌డి కొండ‌చ‌రియ‌ల‌పై ఉండే తేయాకు తోట‌లు ప‌ర్యాట‌కుల చూపును తిప్పుకోనీయ‌కుండా చేస్తాయి.

9. మ్యూజియం
మున్నార్ లో టీ మ్యూజియం కూడా ఉంది. 2005 లో దీన్ని ప్రారంభించారు. ఇందులో టీ త‌యారీ గురించి ప‌ర్యాట‌కులు తెలుసుకోవ‌చ్చు. అలాగే ప‌లు భిన్న‌మైన రకాల‌కు చెందిన టీ రుచుల‌ను కూడా ఇక్కడ ఆస్వాదించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version