45 ఏళ్లు నిండిన వాళ్లకు… 75 వేల రూపాయలు: వైఎస్ జగన్

-

ఏపీలో పాలిటిక్స్ మరీ ఇంత వేడెక్కుతాయని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. నిజానికి సార్వత్రిక ఎన్నికల దేశమంతా వస్తున్నా… కేవలం ఏపీలోనే రసవత్తరంగా మారాయి. ప్రతిపక్షాలు, అధికార పార్టీలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం కామనే. కానీ.. ఏపీలో మాత్రం రాజకీయాలు వేరే రూట్ తీసుకుంటున్నాయి.

వైఎస్ జగన్ ప్రకటించిన పథకాలను కాపీ కొట్టి వాటిని అమలు చేయడం ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ ఒకటి అంటే ఆయన రెండు అనడం ఇలా.. చంద్రబాబు రెచ్చిపోయి ఇప్పుడు నిరుద్యోగ భృతి, డ్వాకా మహిళలకు డబ్బు, పింఛన్లను డబుల్ చేయడం .. ఇవన్నీ జగన్ ప్రకటించిన పథకాలే.

ఇలా చంద్రబాబు ప్రతిదీ కాపీ చేస్తుండటంతో చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ లు ఇస్తున్నారు జగన్. ఇవాళ అనంతపురంలో జరిగిన సమరశంఖారావ సభలో జగన్ మాట్లాడుతూ… చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు. చంద్రబాబు చేతిలో మోసపోవద్దని.. చంద్రబాబు ప్రకటించే పథకాలన్నీ బూటకాలని చెప్పారు. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దని హితువు పలికారు. 45 ఏళ్లు నిండితే చాలు.. నాలుగు విడుతలుగా 75 వేల రూపాయలు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఆయన చిల్లర మాటలకు.. చిల్లర డబ్బులకు లొంగిపోవద్దని ఏపీ ప్రజలకు సూచించారు. అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి, అన్న చేయూత లాంటి కార్యక్రమాలను తీసుకొస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version