కొత్త సంవత్సరం లో అయినా విజయం పొందాలనుకుంటున్నారా..? అయితే ఈ తప్పులు చెయ్యద్దు…!

-

మనిషి ఏమనుకున్నా సరే సాధించడానికి అవుతుంది. కానీ దానికి తగ్గ కష్టం పడాలి. అలానే నమ్మకంతో ముందుకు వెళితే దేనినైనా సాధించవచ్చు. అయితే మనం సాధారణంగా సంవత్సరం మొదట్లో ఎన్నో విషయాలు అనుకుంటూ ఉంటాము. వాటిని కచ్చితంగా సాధించాలని అనుకుంటూ ఉంటాము.

కానీ మధ్యలోనే వాటిని వదిలేయడం.. పట్టించుకోకుండా విడిచి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాము. అయితే అలా కాకుండా నూతన సంవత్సరంలో మనం అనుకున్నవి సాధించాలన్నా, గెలుపొందాలన్నా తప్పకుండా వీటిని పాటించాలని చెబుతోంది చాణక్య నీతి. ఈ ప్రకారం ఫాలో అయితే కచ్చితంగా అనుకున్నవి సాధించవచ్చునని ఆచార్య అంటున్నారు. అయితే అనుకున్నది ఎలా సాధించవచ్చు…?, ఎలా అనుసరిస్తే మనం గెలుపొందచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

విమర్శలకు దూరంగా ఉండండి:

మీరు జీవితంలో అనుకున్నది సాధించాలంటే విమర్శలకు అసలు చోటు ఇవ్వద్దు. వీటి వల్ల మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన కలుగుతాయి. అలానే లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా అవ్వదు. అందుకనే వీటిని విడిచిపెడితే కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటారు.

సమయపాలన ముఖ్యం:

ప్రతి ఒక్కరికి కూడా ఏ విషయంలోనైనా సమయపాలన ఉండాలి. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకూడదు ఒకసారి దాటి పోయిన సమయం తిరిగి మళ్ళీ రాదు. మీరు అనుకున్నది సాధించాలంటే సమయపాలన ఉండాలి. అప్పుడు తప్పక విజయం మీరు పొందొచ్చు.

డబ్బులను ఆదా చేసుకోండి:

డబ్బులను వృధా చేసుకుంటే మళ్ళీ మన దగ్గరికి డబ్బు రాదు. అలాగే సహాయం చేయడానికి కూడా ఎవరు రారు. డబ్బు ఆదా చేసుకోవడం నిజంగా మంచి గుణం. డబ్బు ఆదా చేసుకుంటే కూడా మనం అనుకున్నది చేయగలం. అలానే స్వయంకృషి, ఆత్మ విశ్వాసం, పట్టుదల తో ముందుకు వెళ్ళండి ఇలా చేస్తే తప్పక విజయం మీదే.

Read more RELATED
Recommended to you

Latest news