ఆ వీడియోలు చూస్తూ.. గంటకు 1500 సంపాదిస్తున్న యువతి..!

అప్పుడప్పుడు మనం కొన్ని క్రేజీ జాబ్స్‌ గురించి వింటుంటాం. అసలు ఇలాంటి జాబ్‌లు కూడా ఉంటాయా అని మీకు డౌట్‌ వస్తుంది కూడా. ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేస్తే ఓనర్‌ చెంప పగలగొట్టాలి అదే జాబ్.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇంకాస్త వెరైటీ. నిజానికి ఈ జాబ్‌ అబ్బాయిలకు వస్తే పండగ చేసుకుంటారేమో కానీ అమ్మాయి చేస్తుంది. కేవలం ఆ వీడియోలు చూస్తూ.. గంటకు రూ.1500 పైనా సంపాదిస్తోంది ఆ యువతి..ఈపాటికే మీకు అదేం జాబో ఐడియా వచ్చి ఉండాలే..!

స్కాట్‌ల్యాండ్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి బంపర్ ఆఫర్ వచ్చింది. పోర్న్ వీడియోలు చూస్తూ గంటకు 20 డాలర్లు సంపాదిస్తుంది. పురుషులైతే పర్వాలేదు. కానీ, అమ్మాయిలకు అలాంటి వీడియోలు చూడటం కాస్త ఇబ్బందే. పైగా, ఈ విషయం నలుగురికి తెలిస్తే ఇజ్జత్‌ పోతుంది. అయితే, గ్రీనోక్‌కు చెందిన రెబెక్కా డిక్సన్ అనే 22 ఏళ్ల అమ్మాయిని ఈ జాబ్ వరించింది. ఈ ఉద్యోగం చేసేందుకు సుమారు 90 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. ఆ కంపెనీ కేవలం డిక్సన్‌ను మాత్రమే ఎంపిక చేసుకుంది.

అసలేంటి జాబ్‌..

బెడ్‌బైబిల్స్’ (Bedbible) పోర్న్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు ఆమె హెడ్. ఆమె ప్రాజెక్టుపై పనిచేసే ప్రతి గంటకు ఆ కంపెనీ రూ.1562 చొప్పున చెల్లిస్తూనే ఉంటుంది. Bedbible అనేది ఎథికల్ సెక్స్ సైట్. పోర్న్ ఇండస్ట్రీపై మరింత అవగాహన పొందడం కోసం ఈ పరిశోధన ప్రారంభించారట. ఇందులో భాగంగా శృంగార భంగిమలు, సెక్స్ నిడివి, భావప్రాప్తి, స్త్రీ-పురుషుల నిష్పత్తి తదితర వివరాలను తెలుసుకోవల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డిక్సన్‌ పోర్న్ వీడియోలు చూస్తూ.. మరింత లోతుగా అన్వేషించి గణంకాలను నమోదు చేయాలి. అందులో ఆమె కనిపెట్టిన కొత్త విషయాలను నోట్‌ చేసుకోవాలి. మొదటి అసైన్‌మెంట్‌లో డిక్సన్‌కు 100 పోర్న్‌హబ్ వీడియోలు చూడాలి. ఆ వీడియోల మొత్తం వ్యవధి, సెక్స్ పొజిషన్లపై ప్రత్యేకంగా నోట్స్ రాయాలి. ప్రస్తుతం ఆమె ఆ పనిలోనే ఉంది.

తను చేసే ఉద్యోగం గురించి తను గర్వంగా భావిస్తుందట. ఇది ఒక గొప్ప అవకాశంగా ఫీల్ అవుతున్నా అని రెబెక్కా తెలిపారు. మొత్తానికి అలా కూడా పైసల్‌ సంపాదించేస్తున్నారు.!

-Triveni Buskarowthu