టీవీ చూస్తూ.. గొడవ.. అంతలోనే అనంతలోకాలకు…

జీవితం చాలా విలువైందని చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నప్పటికీ కొంత మంది చనిపోయేందుకు చూపే కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. తనకు నచ్చిన డ్రెస్ కొనివ్వలేదని, అందంగా లేనని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఇలా చాలా మంది రకరకాల కారణాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం నేరం అని కోర్టులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా… ఇటువంటి వారిలో మార్పు రావడం లేదు. ఇలా ఓ చిన్న కారణంతో కేరళకు చెందిన ఓ 11 సంవత్సరాల పసి పాప క్షణికావేశంలో తన ప్రాణాలు తీసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక తన సిస్టర్ తో కలిసి టీవీ చూస్తుంది. ఇలా టీవీ చూస్తున్నపుడు తన అక్కతో జరిగిన గొడవ కారణంగా క్షణికావేశంలో ఆ బాలిక ఘోరం చేసింది. గొడవ జరిగిన అనంతరం తన బెడ్రూంలోకి వెళ్లి… డోర్ లాక్ చేసుకుని అక్కడ కిటికీకి ఉన్న ఊచలకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. బెడ్రూంలోకి వెళ్లిన అమ్మాయి ఎంతకూ బయటకు రాకపోవడంతో అసలు ఏం జరిగిందో చూద్దామని అక్కడకు వెళ్లిన ఆ బాలిక నానమ్మ ఒక్క సారిగా షాక్ కు గురైంది . మనస్థాపం తో ఆ బాలిక కిటికీ ఊచలకు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో ఏం చేయాలో తోచక ఆమె వెంటనే పోలీసుకు సమాచారం అందించింది. అలా పోలీసులు వచ్చే సరికే ఆ బాలిక ఊపిరాడక మరణించింది. దీంతో చేసేదేం లేక పోలీసులు వెనక్కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.