వాట్ ఎ క్రియేటివిటీ..స్కూటర్ ను ఇలా కూడా వాడోచ్చా..!!

-

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత మనుషులకు తెలివి కూడా బాగా పెరిగింది..కొత్తగా ఏదైనా చెయ్యాలని మెదడుకు పదును పెడుతున్నారు..అంతేకాదు కొంతమంది చేసి చూపిస్తున్నారు..ఇలా నేర్చుకున్న వాటిని అమలు చేసేందుకు కొంచెం తెలివి.. ఇంకొంచెం కామన్‌సెన్స్ పెడుతున్నారు. అంతే అవి కాస్తా అద్భుతాలుగా మారుతున్నాయి.. ఇలాంటి కొత్త కొత్త పరికరాలు వెలుగు లోకి వస్తున్నాయి.. కొన్నింటికి జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనసు పెడితే ఎంత కష్టమైన పని అయిన సులువుగా చేసేస్తారు.

పెద్దలు చెప్పినట్లు మనం దేని మీదైనా మనసు పెడితే.. అది అత్యద్భుతంగా మారడం ఖాయం. సరిగ్గా ఇక్కడ ఓ మనిషి చేసిన పని ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అది చూశాక నెటిజన్లు అసలు స్కూటర్‌ను ఇలా కూడా వాడొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి నిర్మాణ పనుల కోసం స్కూటర్‌ను ఉపయోగించాడు. అతడు స్కూటర్ మోటారుకు తాడు చివరి భాగాన్ని జోడించాడు.

ఆ స్కూటర్ సాయంతో సిమెంట్ బస్తాలను నిర్మాణ భవనంపై ఉన్న కూలీలకు అందిస్తున్నాడు. స్కూటర్‌పైన ఉన్న వ్యక్తి ఇంజిన్‌ను రైజ్ చేయగా.. ఆ బస్తా పైకి వెళ్తుంది. దీని ద్వారా మనుషుల సంఖ్యను, ఖర్చును ఒకేసారి తగ్గించవచ్చునని చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇక ఈ ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర ట్విట్టర్‌ ద్వారా మెచ్చుకున్నారు. ‘వీటిని పవర్ రైళ్లు అని పిలుస్తారు. వాహనాల ఇంజిన్‌ల శక్తిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చునని.. ఇలాంటి స్కూటర్లు ప్రస్తుతం సెకండ్‌హ్యాండ్‌లో దొరుకుతున్నాయని’ పేర్కొన్నారు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news