ఏనుగుల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి..? ఎప్పుడూ ఒకటే తింటాయా..?

-

ఏనుగులు అంటే ఎంత భయపడతామో అంతే ఇష్టపడతాం. ట్రైనింగ్‌ ఇచ్చిన ఏనుగులపైకి ఎక్కి తిరగాలని చాలా మంది అనుకుంటారు. కొన్ని దేవాలయాల్లో కూడా ఏనుగులను అందంగా అలంకరించి తిప్పుతారు. మనం తిరుమలలో ఏనుగులను చూడొచ్చు. అయితే ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తాయి, వాటికి ఎదురు వెళ్తే ఎత్తి కుదేస్తాయి. ఆ పంటను నాశనం చేస్తాయి కానీ అవి తినవు. అసలు ఏనుగులు ఏం తింటాయి. తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ విషయాల్ని కనుగొన్నారు.

కెన్యాలోని రెండు ఏనుగుల సమూహాల ఆహార అలవాట్లపై నిపుణులు పరిశోధనలు జరిపారు. అవి ఏ సమూహాలు ఏయే రకాల మొక్కలను ఇష్టపడతాయో కనుగొన్నారు. దీని ఫలితంగా జీవశాస్త్రవేత్తలకు వాటి సంరక్షణ మార్గాలను కనుగొనడంలో సహాయపడుతుందని అంటున్నారు. జంతువులు తమ అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారం దొరకనప్పుడు మనుగడ కోసం ఏదో ఒకటి తింటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే వాటినే ఆహారంగా మార్చుకోవనే విషయాన్ని నిపుణులు గుర్తించారు. అదే విషయాన్ని రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్‌లో ప్రచురించబడింది.

జంతువులు తీసుకునే ఆహారాన్ని బాగా అర్థం చేసుకోవడం ద్వారా ఏనుగులు, ఖడ్గమృగాలు, గేదెలు వంటి జాతులను బాగా సంరక్షించగలమని వాటి సంఖ్యను కూడా పెంచగలమని కార్ట్‌జినెల్ బ్రౌన్‌లో ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అండ్ ఎకాలజీ, ఎవల్యూషన్ అండ్ ఆర్గానిస్మల్ బయాలజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు.

ఏనుగు తీసుకునే ఆహారాన్ని సూచించే DNA శకలాలను మొక్కల DNA బార్‌కోడ్‌ల లైబ్రరీతో పోల్చారు. పరిశోధకులు ఈ సాంకేతికత కోసం అప్లికేషన్‌లను అభివృద్ధి చేశారు. పరిరక్షకులు సమస్యకు పరిష్కారాలను కనుగొనడంలో సహాయం చేయడానికి మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌లో పరిశోధకులను ఒకచోట చేర్చారు.

ఏనుగులు వర్షపు రోజులలో పచ్చి తాజా గడ్డిని, పొడి వేసవి రోజులలో చెట్ల భాగాలను తింటాయని గతంలో జరిపిన రీసెర్చ్‌ ఆదారంగా కనుగొన్నారు. కానీ తాజా పరిశోధనల్లో మాత్రం ఏనుగులు ఆహారం విషయంలో వైవిధ్యాన్ని కోరుకుంటున్నాయని కనుగొన్నారు. ఏనుగులు గుంపుగా కలిసి జీవిస్తున్నప్పుడు కూడా ఒకే రకమైన ఆహారాన్ని తినవట. వారి వైవిధ్యం ఆహారం లభ్యతపై మాత్రమే ఆధారపడి ఉండదు. కానీ వాటి ఇష్టాలు, అయిష్టాలు కూడా దోహదం చేస్తాయి.

సింహాలు, పులులు లాంటి క్రూరమృగాలు అయితే వాటి కంటే చిన్న జంతువులన్నింటిని వేటాడి తింటాయి. అన్ని సింహాలు ఒకే రకమైన ఆహారాన్ని తింటాయి. ఎప్పుడూ అదే తింటాయి. కానీ ఏనుగులు అలా కాదు. సీజన్‌ను బట్టి వాటి లైఫ్‌స్టైల్‌ మార్చేస్తాయి. మనుషుల్లో మనకు ఎలా అయితే ఒక్కో జిహ్వకు ఒక్కో రుచి ఉంటుందో.. ఏనుగులకు కూడా అంతే.. ఒక్కో ఏనుగుకు ఒక్కో రకమైన ఆహారం నచ్చుతుంది. కొన్ని నచ్చవనమాట..!

Read more RELATED
Recommended to you

Latest news