అమెరికాలో భారతీయ యువకులు పడుతున్న కష్టాలు ఏంటి…? అమెరికా అనేది నరకమేనా…?

-

అమెరికా అనగానే ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడాలని భావిస్తూ… ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడి నుంచి అమెరికా గడ్డ మీద అడుగు పెడతారు. తల్లి తండ్రులు తిని తినక, కష్టపడి పోగు చేసిన సొమ్ము ద్వారా అమెరికాలో అడుగు పెట్టిన వారి పరిస్థితి ఏంటి…? పేరుకి అమెరికాలో ఉండటమే గాని తమ జీవితం నరకమని అంటున్నారు. అవును పేరుకి మాత్రమె అమెరికా… పడే కష్టాల గురించి చెప్తే ఇదేం జీవితం అనిపిస్తుంది అంటూ వాపోతున్నారు.

అమెరికా వెళ్ళే వారి ఆర్ధిక పరిస్థితి అందరిది బాగుండాలి అనేది ఏం లేదు… బాగున్న వారి పరిస్థితి పక్కన పెట్టి బాగోలేని వారి పరిస్థితి ఒక్కసారి చూస్తే… విద్యార్ధులుగా ఉన్నప్పుడు మొత్తం ఇండియాలో ఉన్న తల్లి తండ్రుల మీద ఆధారపడుకుండా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇండియన్ రెస్టారెంట్, పెట్రోల్ బ౦క్, షాపింగ్ మాల్స్ ఇలా… అనుమతి ఉన్నదానికంటే ఎక్కువ సమయం అక్కడ కష్టపడుతూ ఉంటారు. అక్కడి వాళ్ళు కూడా తక్కువ ధరకు పని చేస్తున్నారని మన వారితోనే ఎక్కువగా పని చేయించుకుంటూ ఉంటారు.

దీనితో సరైన నిద్ర లేక ఆరోగ్యం పాడై… తిరిగి వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇరుకు గదుల్లో వారు పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పది మందికి పైగా ఒక గదిలో ఉంటూ… పలు చర్మ వ్యాధుల బారిన కూడా పడుతూ ఉంటారు. ఇక విద్యార్ధులుగా ఎంఎస్ చేస్తున్న సమయంలో వచ్చే అనుమతుల ద్వారా ఉద్యోగాలు చేసే వారు, వీసా స్టేటస్ వచ్చేవరకు కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వీసా స్టేటస్ రాకపోతే మళ్ళీ ఫీజు కట్టి చదవాల్సి ఉంటుంది. ఇలా దశాబ్దం కి పైగా కష్టపడుతున్న వాళ్ళు అక్కడుఉన్నారు. గ్రీన్ కార్డులు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదట.

దాదాపు ఇప్పుడు ఉన్న వాళ్లకు అవి ఇవ్వాలి అంటే… వందేళ్ళు పడుతుందని సమాచారం. ఇక ఉద్యోగాలు లేని వారు అయితే తల్లి తండ్రుల మీద ఆధారపడలేక, అక్కడ ఉండలేక, తిరిగి ఇక్కడికి రాలేక పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అందుకే అమెరికా జీవితం అనేది పేరుకే అందం, బ్రతకడానికి నరకమని అక్కడ ఉండే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అక్కడ ట్రంప్ తీసుకునే నిర్ణయాల దెబ్బకు స్థానికులకే కంపెనీలు కూడా పెద్ద పీట వేస్తున్నాయి. ఈ విధంగా భారతీయ్ యువకులు అమెరికాలో నరకం చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version