మనకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏం చేస్తాం. దేవుడిని తలుచుకుంటాం. అంటే.. దేవుడే ప్రత్యక్షమై మన కష్టాలను తీరుస్తాడా? లేదు.. మనిషి రూపంలోనే వచ్చి మన సమస్యలను తీర్చేలా చేస్తాడు దేవుడు.
సాధారణంగా నిద్రపోయాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక కల వస్తుంది. కొంతమంది ఆ కలను తెల్లారాక మరిచిపోతారు. మరికొంతమంది గుర్తు పెట్టుకుంటారు. ఇంకొందరికి తెల్లారే ముందు కలలు వస్తుంటాయి. ఆ కలలు నిజం కూడా అవుతాయట. ఇలా.. కలల మీద ఒక్కొక్కరికి ఒక్కొక అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం కూడా కలల గురించే. అయితే.. కలలో ఎవరెవరో కనిపిస్తుంటారు. ఎవరు కనిపిస్తే ఏమౌతుంది.. అనేదే చాలామందికి తెలియదు.
కొందరికి కలల్లో పాములు కనిపిస్తుంటాయి. మరికొందరికి దయ్యాలు కనిపిస్తుంటాయి. దేవుడు కనిపిస్తుంటాడు. ఇలా రకరకాలుగా వస్తుంటాయి కలలో. అయితే.. అన్నింటి గురించి ఇప్పుడే మనం చర్చించుకోలేం కానీ.. ఒకవేళ కలలో దేవుడు కనిపిస్తే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మనకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఏం చేస్తాం. దేవుడిని తలుచుకుంటాం. అంటే.. దేవుడే ప్రత్యక్షమై మన కష్టాలను తీరుస్తాడా? లేదు.. మనిషి రూపంలోనే వచ్చి మన సమస్యలను తీర్చేలా చేస్తాడు దేవుడు. కష్టాల్లో ఆదుకుంటాడు. అయితే.. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కలలో కనిపిస్తాడట. కొన్ని సందేశాలు అందిస్తాడట. అంటే.. దేవుడు కలలో కనిపిస్తే అది శుభ సూచకం అట.
మీరు దేనికోసమైన ప్రయత్నిస్తున్న సమయంలో కలలో దేవుడు వస్తే అది నెరవేరుతుందని అర్థం. మీ పనుల్లో ఎటువంటి ఆటంకం ఉండదు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు.. ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోలేనప్పుడు దేవుడు మీకు కలలో కనిపించి దారి చూపిస్తాడట. మీ అంతరంగాన్ని, అంతరాత్మను నమ్మాలంటూ దేవుడు సందేశం ఇస్తాడట. దేవుడు మీ కలలోకి వచ్చాడంటే.. దేవుడి కటాక్షాలు మీ మీద ఉన్నట్టు లెక్క.
అయితే.. దేవుడు ప్రతిసారి కలలో కనిపిస్తున్నాడంటే ప్రతి సారి ఏదో మంచే జరుగుతుందని భావించకండి. మీరు దేవుడికి ఏదైనా మొక్కు చెల్లించాల్సినప్పుడు.. ఆ మొక్కును గుర్తు చేయడానికి కూడా దేవుడు కలలో కనిపిస్తాడట.