తల్లిగా, క్రీడాకారిణిగా విజయవంతంగా రాణిస్తున్న ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ వీరే …!

-

చాలా మంది మహిళలు అనుకున్నది సాధించాలని అనుకుంటారు. కానీ కన్న కలలు అందరికీ నిజం అవ్వవు. కొందరు అనుకున్నది సాధించాలి అని అనుకుంటారు కానీ చదువుని మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. మరి కొందరు బాగా చదువుకుంటారు కానీ పెళ్లి తర్వాత కెరియర్ ఆపేయాల్సి వస్తుంది.

ఇలా ఒక్కొక్కరి మహిళా జీవితం ఒక్కోలా ఉంటుంది. కానీ ఈ స్పోర్ట్స్ ఉమెన్స్ మాత్రం పెళ్లి తర్వాత కూడా కెరీర్లో బాగా విజయవంతమయ్యారు. నిజానికి చాలామంది పెళ్లి తర్వాత వాళ్ళ పనులను ఆపేస్తారు. కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారుమరి కొంత మంది పిల్లల తర్వాత క్విట్ చేసేస్తారు. కానీ వీళ్ళు మాత్రం పెళ్లైనా… పిల్లలు పుట్టినా మంచి స్పోర్ట్స్ ఉమెన్ గానే రాణిస్తున్నారు మరి వారి కోసం ఎప్పుడూ చూద్దాం.

సానియా మీర్జా:

సానియా షోయబ్ మాలిక్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ఒక బాబుకి జన్మనిచ్చారు. అయినప్పటికీ ఆటని మళ్లీ కొనసాగించి ప్రాక్టీస్ చేశారు.

సహన కుమారి:

ఈమె హై జంప్ కేటగిరిలో జాతీయ రికార్డు సృష్టించారు. ఈమె ఒలింపిక్స్ లో పాల్గొనే సమయానికి ఒక అమ్మాయికి తల్లి. అయినప్పటికీ ఆమె పోటీలో పాల్గొన్నారు.

కోనేరు హంపి:

ఈమె చెస్ ఛాంపియన్. ఈమె ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత రెండు సంవత్సరాల వరకు చెస్ కి దూరంగా ఉండి 2019లో మళ్ళీ తిరిగి ఆట కి వచ్చారు.

మేరీకామ్:

ఈమె పెళ్లి తర్వాత నలుగురు పిల్లల్ని కన్నారు. అయినప్పటికీ ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు మేరీకామ్.

అనిత పాల్ దురై:

భారత్ బాస్కెట్ బాల జట్టు మాజీ కెప్టెన్ అనిత 2013లో తల్లి అయ్యారు. అయినప్పటికీ ఆటని కొనసాగించారు.

సరితా దేవి:

బాక్సర్ అయిన సరితా దేవి కూడా తల్లిగా క్రీడాకారిణిగా కూడా విజయవంతమయ్యారు.

కృష్ణ పూనియా:

డిస్కస్ త్రో లో ఎన్నో రికార్డులు సాధించారు. ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత కూడా ఈమె ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news