స్ఫూర్తి: కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని రుజువు చేసారు.. కూలి పనులు చేసి చదుకుని ఇంత ఎత్తుకు…

-

జీవితంలో ఒక్కొక్కసారి కష్టం వస్తూనే ఉంటుంది. ఆ కష్టాన్ని మనం ఎదుర్కొని దాటుకుపోతే జీవితం ముందుకు వెళ్తుంది. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరు జీవితంలో చదువుకి ప్రాముఖ్యత ఇవ్వాలి. నిజానికి చదువు ఉంటే మనం దేనినైనా సాధించవచ్చు. నల్గొండ జిల్లా చండూరు మండలం లోని కొండాపురం లో ఉండేవారు కొత్తపల్లి నరసింహ.

 

తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయం చేయడంతో ఈయన అన్నా, అక్క కూడా వాళ్ళకి సహాయం చేసేవారు. పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలో చదివారు. మండల కేంద్రం లోని డాన్ బోస్కో జూనియర్ కాలేజ్ లో ఎంపీసీ గ్రూప్ లో ఇంటర్ పూర్తి చేశారు. అయితే తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లినప్పుడు వాళ్లతో పాటు ఈయన కూడా కూలీ పనులకు వెళ్లేవాడు.

2002లో టీచర్ ఉద్యోగం వచ్చింది. దీంతో ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఆయనలో కలిగింది. 2007లో గ్రూప్ వన్, గ్రూప్ టు కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఆ పరీక్షలని కూడా వ్రాసారు. గ్రూప్ వన్ లో డిఎస్పీగా సెలక్ట్ అయ్యారు. గ్రూప్ టు లో ఏసిటివో వచ్చింది నిజానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఏ పరీక్షలో అయినా సులభంగా విజయం సాధించవచ్చు అని ఈయన చెప్పారు.

అదే విధంగా ఎలాంటి గైడ్లైన్స్ కూడా ఆయనకి లేదు. అయినప్పటికీ సరే పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా వచ్చే మ్యాగజైన్స్ లో సక్సెస్ స్టోరీస్ ప్రేరణ కలిగిస్తాయని ఆయన చెప్పారు. సొంతంగానే ప్రిపరేషన్ కూడా చేసేవారు. ఇప్పుడు ఫైనల్ గా డిఎస్పీగా కూడా ఉద్యోగం వచ్చింది.

కష్టపడితే తగ్గ ఫలితం ఉంటుందని ఈయన జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. నిజానికి చాలా మందికి ఈయనని ఆదర్శంగా తీసుకోవాలి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లు విఫలమైనా సరే ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే ఒకరోజు విజయం అందుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news