మన దేహంలో శక్తి విడుదల కావాలంటే ఎలాక్ట్రాన్లు ఉన్నత శక్తి స్థాయి నుండి తక్కువ శక్తి స్థాయికి దిగినప్పుడు వెలువడే శక్తిని జీవశక్తిగా గ్రహించవలసి ఉంటుంది.
ఎలక్ట్రాన్ ప్రయాణ క్రమంలో ఒక స్థాయి లో ఈ ఋణాత్మకతను బంధించి , స్థిరీకరణ చేసే పరిస్థితి ఉండవలసిందే. లేకపోతే క్యాన్సర్ , మధుమేహం వంటి రోగాలు ఉత్పన్నం అవుతాయి.
ఇట్టి స్థిరీకరణ ప్రక్రియను చేయగలిగే శక్తి కేవలం సిరిధాన్యాలలోని పీచు పదార్థానికి మాత్రమే ఉంది. వీటి పీచు పదార్థం అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణం కలిగి ఉంటుంది.
ఈ సిరి ధాన్యాలు పై పోరాలలో లిగ్నన్లు ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ గా పనిచేస్తాయి. అందువలన ఎలక్ట్రాన్ స్థిరీకరణ జరిగి దేహంలో సంపూర్ణ ఆరోగ్య పరిస్థితి నెలకొంటుంది. అందుకే సంపూర్ణ ఆరోగ్యం కలుగ చేసే సిరి ధాన్యలను మించిన మూల ఆహారం లేదంటే అతిశయోక్తి కాదు.