గ్రేట్ రిజిగ్నేషన్.. జనాలు జాబ్స్ వదిలేయడానికి కారణాలేంటి?

-

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న టాపిక్.. గ్రేట్ రిజిగ్నేషన్. లక్షల మంది ఉద్యోగులు ఒకేసారి తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. కరోనా తర్వాత ఉద్యోగాలు వదిలేయడం అనేది విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కంపెనీలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. మరి దీనికి కారణాలేంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

కంపెనీలు ఉద్యోగుల కన్నా కంపెనీలనే ఎక్కువ పట్టించుకోవడం

ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయం పక్కన పెట్టేసి, కేవలం కంపెనీ లాభాల్లో ఉందా లేదా అన్న విషయమే పట్టించుకోవడంతో, ఉద్యోగులో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. ఎంత పనిచేసినా తమకేదీ రాదన్న ఆలోచన ఉద్యోగుల్లో రావడం ఎక్కువైంది.

ఎక్కువ పని

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా పని ఎక్కువ అవడం కూడా గ్రేట్ రిజిగ్నేషన్ కి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. 24గంటలు అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పడితే అప్పుడు డిస్ట్రబ్ చేస్తూ ఉండడం ఉద్యోగాలు చేసే వారికి తలనొప్పిగా మారింది. దీనివల్ల ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి.

తమ జీవితాన్ని కొత్తగా చూసుకోవడం వల్ల

ముందుగానే చెప్పినట్టు కరోనా వచ్చాక ఉద్యోగుల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియని జీవితంలో ఎందుకు ఎక్కువ కష్టపడి అందర్నీ దూరం చేసుకోవడం అనే ఆలోచన వచ్చింది. కుటుంబ బాధ్యత పెరిగింది. భార్యా, పిల్లలు, స్నేహితులతో కలిసే సమయం లేనపుడు జాబ్ ఎందుకన్న ఆలోచన వచ్చింది.

అభిరుచులు

లాక్డౌన్ కారణంగా అభిరుచుల మీద ఆసక్తి బాగా పెరిగింది. దాని ద్వారానే తమ జీవితాన్ని గడుపుకోవచ్చనే నమ్మకం ఏర్పడింది. అందుకే ఇష్టం లేని జాబ్స్ వదిలేసి, డబ్బులు తక్కువ వచ్చినా, ఇష్టమైన పనిచేసుకోవడం మంచిదని అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version