అప్పుడే పుట్టిన పిల్లలు చిన్నారులు ఎక్కువగా రాత్రి పూట ఏడుస్తూ ఉంటారు రాత్రి పూట నిద్రపోకుండా మారం చేస్తూ ఉంటారు. విపరీతమైన పేచీ పెడుతూ ఉంటారు అటువంటి సమయంలో తల్లికి కూడా నిద్ర ఉండదు. ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు చిన్నారులు. అయితే ఎందుకు రాత్రిపూట మాత్రమే ఎక్కువగా ఏడుస్తుంటారు..? ఉదయం పూట ఎందుకు చక్కగా ఉండి రాత్రిపూట మాత్రమే బాగా ఏడుస్తూ ఉంటారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
చిన్నపిల్లలు ఉదయం పూట చక్కగా నవ్వుతూ ఆడుకుంటూ ఉంటారు కానీ రాత్రి చూస్తే వాళ్ళు విపరీతమైన అల్లరి చేస్తూ ఉంటారు అసలు నిద్రపోరు. కొంత మంది అయితే రాత్రి నిద్రపోతూ ఉంటారు పగలు విపరీతంగా పేచీ పెడుతూ ఉంటారు పిల్లలు అలసట ఫ్రస్టేషన్ వల్ల ఎక్కువగా రాత్రి పూట నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు. అయితే ఇవి కొన్నాళ్ళకి పోతూ ఉంటాయి. ఆకలితో ఉన్నా కూడా పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు.
అటువంటి సమయంలో తల్లి పాలు ఇస్తే నిద్రపోతారు అయితే వెంటనే పాలు డైజెస్ట్ అయిపోతాయి మళ్లీ ఆకలి వేస్తుంది. అందుకని మళ్లీ ఏడ్చేస్తూ ఉంటారు ఆకలి వల్ల ఎక్కువగా పిల్లలు నిద్రపోలేకపోతు ఉంటారు. పిల్లలు ఎదిగేది రాత్రి టైంలోనే కనుక బాగా ఆకలి వేస్తుంది పాలు పట్టినా కూడా ఇంకా ఏడుస్తూ ఉంటారు. అలానే ఎలర్జీ కడుపులో గ్యాస్ వంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏడుస్తూ ఉంటారు. జలుబు వలన కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. దంతాలలో ఇబ్బంది ఉన్నా కూడా పిల్లలు రాత్రిపూట ఏడుస్తూ ఉంటారు. కంఫర్ట్ గా పిల్లల్ని చూసుకోవాలి. తల్లి ప్రేమ కోసం కూడా చిన్నారులు బాగా రాత్రిపూట ఏడుస్తూ ఉంటారు.