BREAKING : వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌.. ఆ పదవులకు బాలినేని రాజీనామా

-

ప్రకాశం జిల్లాలో వైసీపీ కి షాక్..తగిలింది. రీజనల్ కో ఆర్డినేటర్ భాద్యతల నుంచి తప్పుకున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని..పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్ లో ఉన్న బాలినేని..పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే, దీనిపై ఆయన క్యాడర్‌ డిఫరెంట్‌ గా స్పందిస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడని.. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం ఉండదని వారు చెబుతున్నారు. ఆయనతో పార్టీ నేతలు మాట్లాడుతారు.. ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదేనన్నారు. ఆయన రీజినల్ కో ఆర్డినేటర్ గా తప్పుకున్నారనేది సోషల్ మీడియా ప్రచారమే వాదిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news