రాజకీయాల్లోకి ప్రభాస్ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఏ పార్టీలోకి వెళతారంటే?

తెలుగు లెజెండ్రీ నటుడు కృష్ణంరాజు తాజాగా ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక నిన్న ఆయన అంత్యక్రియలు జరిగాయి..ఆయన మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నేతలు ఆయన ఇంటి వద్దకు చేరి కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతలు అలాగే వైసీపీ నేతలు చేరుకొని పార్తివదేహానికి నివాళులు అర్పించి అనంతరం హీరో ప్రభాస్ ని ఓదార్చారు.

ఇక తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన చంద్రబాబు నాయుడు కూడా కృష్ణంరాజు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు..కృష్ణంరాజు పార్థివ దేహాన్ని సందర్శించి ప్రభాస్ ని ఓదార్చి వెళ్ళిపోతున్నా చంద్రబాబు సడన్గా మళ్లీ వెనక్కి వచ్చి ప్రభాస్ను తీసుకొని వెళ్లి కృష్ణంరాజు భార్యను కూడా పరామర్శించడం జరిగింది. కృష్ణంరాజు భార్యను పరామర్శించిన తర్వాత అనంతరం ప్రభాస్ తో కాసేపు కూర్చొని మాట్లాడారు.

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ భుజంపై చేయి వేసి చంద్రబాబు మాట్లాడుతున్న ఫోటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.వెళ్ళిపోతున్న చంద్రబాబు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అంతసేపు ఏం మాట్లాడారు అన్న విషయం పై గుసగుసలు వినిపిస్తున్నాయి..కాగా,కృష్ణంరాజు చనిపోయే ముందువరకు బీజేపీ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ నాయకులు కూడా వచ్చి నివాళులు అర్పించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బీజేపీ పార్టీకి దగ్గర అవడంతో ప్రభాస్ తో రాజకీయాలకు సంబంధించిన మాటలు ఏమైనా మాట్లాడి ఉంటాడా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం విషాదం చోటు చేసుకున్న ఇంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు మాట్లాడి ఉండరు అంటూ అభిప్రాయ పడుతున్నారు.మరి కొందరేమో కృష్ణంరాజు రాజకీయ వారసత్వాన్ని కూడా కుటుంబంలో ఎవరైనా అందిపుచ్చుకొని కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి ఒకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అన్న విషయం కూడా సోషల్ మీడియాలో ప్రచారంలోఉంది.. మరి ప్రభాస్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా? ఉంటే ఏ పార్టీలోకి వెళ్తారో అన్నది చర్చనీయాంశంగా మారింది..